Balakrishna: వీర సింహారెడ్డి తరహాలో బాలయ్య 109 మూవీ కూడా.. సేమ్ టు సేమ్..!

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒకరైన నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలయ్య హీరోగా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ప్రజెంట్ కూడా యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ తన కెరీర్ 109వ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు బాలకృష్ణ.

ఇక ఈ సినిమాకి ముందు బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ చిత్రం కూడా వీర సింహారెడ్డి తరహాలోనే టైటిల్ ప్లాన్ చేస్తున్నట్లుగా బజ్ వినిపిస్తుంది. ఆ సినిమా టైటిల్ ని ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టి వీర సింహారెడ్డి అంటూ రివిల్ చేసిన సంగతి తెలిసిందే.

Balayya 109 movie is similar to Veera Simhareddy
Balayya 109 movie is similar to Veera Simhareddy

ఇక ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ ని బాలయ్య 109 కి కూడా ఫాలో అవుతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీని పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. బాబీ కొల్లి రూపొందిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్‌ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు