Balakrishna : తన సోదరితో ఆప్యాయంగా బాలయ్య..!

Balakrishna : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొత్తగా కొలువుదీరింది. ఈ సందర్భంగా… నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. వీరిద్దరితోపాటు మరో 23 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇందులో జనసేన పార్టీకి చెందిన వారు ముగ్గురు ఉండగా… బిజెపి పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే మంత్రి పదవి దక్కించుకున్నారు. మొత్తం 24 మందిలో… తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంత్రి పదవులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర… ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా… బాలయ్య చేసిన ఓ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video: Balakrishna's Emotional Kiss To Bhuvaneshwari
స్టేజ్ పైన కూర్చున్న నారా భువనేశ్వరిని ఆప్యాయంగా ఆప్యాయంగా పలకరించాడు ఆమె సోదరుడు నందమూరి బాలయ్య. అంతేకాకుండా నారా భువనేశ్వరి నుదుటిపైన… ప్రేమతో ముద్దు పెట్టి బాలయ్య తన మంచి మనసు చాటుకున్నాడు. తన బావ ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో భావోద్వేగం ఆపుకోలేక బాలయ్య… తన సోదరి దగ్గరికి వెళ్లి… ముద్దు పెట్టడం జరిగింది. ఈ సంఘటన ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ జై బాలయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు