Nbk 109: మళ్లీ షూటింగ్ మూడ్ లోకి బాలయ్య.. ఎప్పుడంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. బాలకృష్ణ కొన్ని రోజుల నుంచి రాజకీయాలతోనే ఫుల్ బిజీగా ఉన్నారు. ఫిబ్రవరి వరకు నాన్ స్టాప్ గా బాబీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ….మార్చి నుంచి తన పూర్తి సమయాన్ని పాలిటిక్స్ కే కేటాయించారు.

అటు పార్టీ ప్రచారంతోపాటు, తన సొంత నియోజకవర్గ కోసం సమయాన్ని కేటాయించారు. ఇక హిందూపురంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా….చాలా రోజుల గ్యాప్ తర్వాత బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపునకు వచ్చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు షూటింగ్ మూడ్ లోకి వస్తున్నారట బాలయ్య.

ఆయన హీరోగా చేస్తున్న ఎన్.బి.కె 109 షూటింగ్ సెట్లోకి ఈనెల 20వ తేదీన అడుగుపెట్టబోతున్నారట. కాగా, నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో తెరకెక్కుతున్న “NBK 109” నుంచి మేకర్స్ ఇటీవల అప్డేట్ ప్రకటించారు. మొన్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ….జాలి, దయ పదాలకు అర్థం తెలియని ఓ అసురుడిగా కనిపించనున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలిసిపోతుంది.

- Advertisement -

ఇక ఇందులో బాలకృష్ణ ఎంట్రీ వేరే రేంజ్ లో చూపించారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు