Balayya : ఈ సారి డిఫరెంట్ లుక్ తో..

నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో “అన్ స్టాపబుల్” సీజన్ 2 అతి త్వరలో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సిరీస్ కి ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడంతో ఇప్పుడు రెండవ దానికి భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ 107 సినిమా షూటింగ్ కోసం విదేశాలలో ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

విదేశాలలో ఈ సినిమా షూటింగ్ ముగించుకొని బాలయ్య ఈ వారంలోనే తిరిగి రాబోతున్నారు. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చారు “ఆహా” వారు. అక్టోబర్ 4న ఈ షో యొక్క ట్రైలర్ రిలీజ్ అవుతుందని, ఈ ట్రైలర్ లో బాలకృష్ణ మునుపెన్నడు కనిపించని విధంగా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని ఓ ఇంట్రెస్టింగ్ పిక్ ద్వారా “ఆహ” వెల్లడించింది.

దీంతో ఈ ట్రైలర్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ ట్రైలర్ లోనే సీజన్ 2 యొక్క ప్రసార తేదీని కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ లుక్ లో బాలయ్యని చూడడానికి నందమూరి ఫ్యాన్స్ ఉవ్విళ్లురుతున్నారు. అలాగే మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇలాంటి కాంబినేషన్ అయితేనే జనంలోకి బాగా వెళుతుందనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోందింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు