Balakrishna : బాలయ్య బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలి… ప్రతిదీ కంపారిజన్ అంటే ఎలా బ్రదర్..

Balakrishna : నందమూరి వంశం… నటసౌర్యభౌమ అంటూ పేరు తెచ్చుకున్న నందమూరి తారక రామరావు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ముద్ర వేశారో అందరికీ తెలిసిందే. ఇక అదే తెలుగు రాష్ట్రంలో తారక రామరావు… ఓ పార్టీ పెట్టి… తక్కువ టైంలోనే సీఎం సీటు ఎక్కి కూర్చున్నాడు. అంటే నందమూరి వంశం అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేయడమే కాదు, చరిత్రనూ సృష్టించింది.. అయితే ఈ పరంపరను ముందుకు సాగించడానికి తారక రామరావు 12 సంతానంలో బాలకృష్ణ ఒక్కరే ముందుకు తీసుకెళ్లాడు.

ఇటు సినిమాల్లో లెజెండ్ అంటూ దూసుకెళ్తున్నాడు. అటు రాజకీయాల్లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ, బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బాలయ్య విషయంలో కంపారిజన్ స్టార్ట్ అయింది. ప్రతీ విషయంలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎంతో పోలుస్తున్నారు.

ఎలాంటి పాయింట్స్ కంపేరిజన్ కు వస్తున్నాయంటే…
ఒకటి… సినిమా కెరీర్‌లో బాలయ్య కంటే పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు.
కానీ, సినిమా ఇండస్ట్రీ పరంగా బాలయ్య కంటే పవన్ కళ్యాణే మంచి పొజిషియన్ లో ఉన్నాడు.

- Advertisement -

రెండో పాయింట్… పొలిటికల్ కెరీర్ లో కూడా పవన్ కళ్యాణ్ కంటే బాలయ్యకే ఎక్కువ ఎక్స్ పిరీయన్స్ ఉంది. కానీ, ఇప్పుడు బాలయ్య ఎమ్మెల్యే అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.

ఈ విషయంలో కాస్త లోతుగా మాట్లాడితే… టీడీపీ అంతర్గత వ్యవహరాల కారణంగా బాలయ్య మంత్రి పదవి తీసుకోకపోవచ్చు అనే పాయింట్ చర్చకు రావొచ్చు. కానీ, ఒక ప్రజా ప్రతినిధిగా బాలయ్య.. ప్రజల్లో ఉండటం చాలా తక్కువ సందర్భంల్లో కనిపిస్తుంది. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ జనాల్లోనే కనిపిస్తున్నాడు. ఈ విషయలో బాలయ్య అభిమానులతో పాటు నందమూరి అభిమానులను కూడా కలవరపెడుతుంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు ఈ కంపారిజన్ పెద్దగా లేదు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి విషయంలో బాలయ్యపై విమర్శలు గుప్పించే వాళ్లు ఈ కంపారిజన్ చేస్తున్నారు. అలాగే కొంత మంది… బాలయ్య ఇలా అటు సినిమాలు.. ఇటు పాలిటిక్స్ అంటూ రెండు పడవలపైన కాళ్లు వేస్తూ వెళ్తే, దేనికి న్యాయం చేయలేని పరిస్థితి వస్తుందని, ఏదో ఒకటి తీసుకుని, దానిపై ఫుల్ ఫోకస్ చేయాలని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు