Bandla Ganesh: హరీష్ శంకర్ నా దగ్గరికి వస్తే రాబోయే 25 ఏళ్లు NO.1 డైరక్టర్ గా ఉంటాడు

Bandla Ganesh: ఎస్ జె సూర్య(Sj Surya) దర్శకత్వంలో వచ్చిన ఖుషి(Kushi) సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒక సూపర్ హిట్ సినిమా చేయడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చేసిన ప్రతి సినిమా కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే సినిమాలు ఫెయిల్ అవుతున్న కొద్ది పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పెరుగుతూ వచ్చింది. అలానే క్రేజ్ కూడా పెరిగింది. కానీ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ సినిమా ఒకటి పడితే చూద్దామని ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు. సరిగ్గా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకడు దర్శకుడు అయ్యి పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాను చేసాడు.

షాక్(Shock) సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఆ సినిమా దర్శకుడుగా హరీష్ కు షాక్ ఇచ్చింది. ఆ తరువాత మిరపకాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కంటే ముందు హరీష్ శంకర్ స్పీచ్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విపరీతమైన జోష్ నింపింది. పవన్ కళ్యాణ్ గురించి హరీష్ శంకర్ మాట్లాడిన ప్రతి మాట అందరికీ విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ సినిమా మీద హరీష్ కాన్ఫిడెన్స్ చూడగానే అందరికీ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే వాటన్నిటినీ చాలా సక్సెస్ఫుల్గా అందుకున్నాడు హరీష్.

Bandla Ganesh

- Advertisement -

ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ను నిర్వహించారు. దీనికి హరీష్ శంకర్,బండ్ల గణేష్ హాజరయ్యారు. గబ్బర్ సింగ్ సినిమా రోజులను గుర్తు చేసుకుంటూ అనేక రకమైన విషయాలను పంచుకున్నారు. ఇక ఒక సందర్భంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ హరీష్ శంకర్ నేను ఆర్టిస్ట్ గా పని చేస్తున్నప్పుడు నుంచి నాకు పరిచయం.

చింతకాయల రవి సినిమాకి నన్ను సెలెక్ట్ చేసి అమెరికా పంపించాడు. అప్పటినుంచి మా ఇద్దరికీ మధ్య మంచి అనుబంధం ఉంది. హరీష్ శంకర్ అనేవాడు గొప్ప డైరెక్టర్. ఒక సీసాలో పాలు పోస్తే పాలు, నీళ్ళు పోస్తే నీళ్లు, మందు పోస్తే మందు లా ఉంటుంది. అలాంటి సీసా హరీష్ శంకర్. హరీష్ శంకర్ ను చాలామంది పక్కన పెడుతున్నారు. హరీష్ శంకర్ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. హరీష్ శంకర్ అనే వాడు నాలాంటోడికి గాని దొరికితే 25 సంవత్సరాలు నెంబర్ వన్ డైరెక్టర్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు