Bandla Ganesh on Roja : పగ తీర్చుకున్న బండ్ల గణేష్… రోజా ఓడిపోయాక సంచలన ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈరోజు ఫలితాలు సైతం విడుదలయ్యాయి.. ఇందులో టిడిపి పార్టీ విజయం అందుకుంది.. వైసీపీ పార్టీ చాలా ఘోరమైన పరిస్థితిలో ఓడిపోయింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కనీసం ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి చాలామంది పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే ఆ తర్వాత ఎప్పటికో జగన్ ను కలిసి కేవలం కొంతమంది సెలబ్రిటీలు, నిర్మాతలు, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు.. అయితే ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజవర్గంపైనే అందరూ ఫోకస్ పెట్టారు. చాలామంది సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం జరిగింది.

రెచ్చిపోయిన బండ్ల గణేష్..

Bandla Ganesh on Roja : Bandla Ganesh took revenge... Sensational tweet after Roja's defeat
Bandla Ganesh on Roja : Bandla Ganesh took revenge… Sensational tweet after Roja’s defeat

మరి కొంతమంది టీడీపీ పార్టీకి సపోర్టుగా నిలిచారు.. గతంలో నటుడుగా నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని అన్న సంగతి ఎన్నో సందర్భాలలో బయటపెట్టారు.. ఇటీవల కాలంలో రాజకీయాల పరంగా కూడా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ లో కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు బండ్ల గణేష్.. ముఖ్యంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నీ చిన్న మాట అన్నా సరే పెద్ద ఎత్తున హంగామా చేస్తూ ఉంటారు బండ్ల గణేష్.

జబర్దస్త్ పిలుస్తోందంటూ రోజాకి కౌంటర్…

ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా నగరి వైసిపి అభ్యర్థిగా నిలబడిన సినీనటి రోజా పైన బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.. మళ్లీ జబర్దస్త్ పిలుస్తోంది రండి అంటూ ఒక పోస్ట్ చేస్తూ ఆమె ఫోటోని షేర్ చేశారు.. దీంతో పలువురు అభిమానులు సైతం కాస్త ఫైర్ అవుతున్నప్పటికీ.. మరికొంతమంది జనసేన కార్యకర్తలు, నేతలు సైతం బండ్ల అన్న సరైన సమయంలోనే ఈ ట్విట్ చేశారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి పైన రోజా ఫైర్ కావడం జరిగింది.

- Advertisement -

రోజా తోపాటు ఆ నేతలను టార్గెట్..

తాజాగా ఎన్నికలలో నగరి నుంచి రోజా ఓడిపోవడంతో బండ్ల గణేష్ తన ట్విట్టర్ నుంచి ఇలాంటి పోస్ట్ షేర్ చేయడం జరిగింది. రోజానే కాకుండా కొడాలి నాని వల్లభనేని వంశీ , అంబటి రాంబాబు పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది బండ్ల గణేష్. మరొకసారి తన పగని ఇలా తీర్చుకున్నారు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ట్విట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈసారి ఎన్నికలలో జనసేన పార్టీ చాలా కీలకంగా మారిందని కూడా చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే వైసిపి పార్టీని అధపాతాళానికి తొక్కేశారు.. ఇప్పుడు చెప్పినట్టుగానే 21 సీట్లలో 20 సీట్లలో ఆధిక్యత చూపిస్తూ మందంజలో దూసుకుపోతున్నారు జనసేన పార్టీ అభ్యర్థులు..

గెలుపు ముఖ్యం కాదు మెజారిటీ ముఖ్యం.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే 12 రౌండ్లలో 64,492 ఓట్ల మెజారిటీ సాధించి.. రికార్డు సృష్టించారు మొదటినుంచి పవన్ కళ్యాణ్ గెలుపు ముఖ్యం కాదు మెజారిటీ ముఖ్యం అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. ఇక అన్నట్టుగానే భారీ మెజారిటీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారని స్పష్టం అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు