Bangladesh Actress : సినిమా నటుల్ని కూడా వదలడం లేదు.. బంగ్లాదేశ్ నటి రోకెయా ప్రాచీపై మూక దాడి..

Bangladesh Actress : గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో తెలిసిందే. బాంగ్లాదేశ్ ప్రధాని ఆకస్మిక రాజీనామాతో మొదలైన మత ఘర్షణలు, ఎంతో మంది అమాయకుల మృతికి కారణమయ్యాయి. ఎంతో మంది ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ దేశ మాజీ ప్రధానియే పారిపోయి భారత్ లో తలదాచుకుంది. అయితే అక్కడ లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా కంట్రోల్ తప్పిపోయిందని చెప్పాలి. బాంగ్లాదేశ్ కి సంబంధించిన రాజకీయ ప్రముఖులకే కాదు, సినీ ప్రముఖులపై దాడులు జరుగుతున్నాయి. ఇక తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

Bangladesh Actress Rokeya Prachi attacked by thugs

సినిమా నటుల్ని కూడా వదలని మూకలు..

ఇక బాంగ్లాదేశ్ లో గొడవలు, మత ఘర్షణలు పీక్స్ కి చేరుకున్నాయని చెప్పాలి. అక్కడ పెద్ద పెద్ద ప్రముఖులకు కూడా రక్షణ లేకుండా పోయింది. రీసెంట్ గా బాంగ్లాదేశ్ కి సంబంధించిన బెంగాలీ సినిమా ఇండస్ట్రీ బడా నిర్మాత సలీం ఖాన్, అలాగే ఆయన కుమారుడు హీరో అయిన షాంటో ఖాన్‌ ని దారుణంగా బాంగ్లాదేశ్ ఆందోళన కారులు దారుణంగా రాళ్లతో కొట్టి చంపారని తెలిసిందే. ఇంతలో తాజాగా మరో ఘటన జరిగింది. ప్రముఖ బంగ్లాదేశ్ నటి “రోకెయా ప్రాచీ” పై ఆందోళన మూక దాడి జరిగింది.

- Advertisement -

బంగ్లాదేశ్ నటిపై దాడి..

ఇక తాజాగా బంగ్లాదేశ్ బెంగాలీ ప్రముఖ అయిన నటి రోకెయా ప్రాచీ (Actress Rokiyaa Prachi) పై దాడి జరిగింది. ఆ దేశ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్‌ కు నివాళులు అర్పించేందుకు ఆమె వెళ్తుండగా కొందరు ఆందోళనకారులు గుంపుగా వచ్చి దాడి చేశారు. ఇక ఆ దాడిపై నటి రోకియా స్పందిస్తూ, ఆ దుండగులు చంపేస్తామని తనను బెదిరించినట్లు ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా తన దుస్తులు దారుణంగా చింపారని, శారీరకంగా వేధించారని ఆమె వాపోయారు. ఇక తనపై దాడి చేసిన వారంతా జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వారని ఆమె తెలిపారు. ఇక బాంగ్లాదేశ్ లో ఈ మారణహోమం ఎప్పుడు చల్లారుతుందో అని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు