Custody: బేబమ్మ బాగానే కష్టపడింది.. మరి ఫలితం వచ్చేనా?

బేబమ్మ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ కృతి శెట్టికి అర్జెంట్ గా సాలిడ్ హిట్ పడాల్సిన టైమ్ వచ్చింది. గత కొంత కాలంగా ఈ అమ్మడికి ఏది కలిసిరావడం లేదు. కెరీర్ బిగినింగ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ సుందరి ఇప్పుడు ఆ పేరుకు సరైన న్యాయం చేయలేకపోతోంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అని అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం యావరేజ్ హిట్ కోసం తహతహ లాడుతుంది. ఉప్పెన, శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాల సక్సెస్ తో కోటి కి పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రేంజికొచ్చింది బేబమ్మ.

అయితే సక్సెస్ లు వచ్చి పడుతుండడంతో స్క్రిప్ట్ లు సరిగా వినకుండా అన్ని రకాల సినిమాల చేస్తూ వచ్చింది. ఫలితంగా డిజాస్టర్లు పలకరించాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమాలు వరుసబెట్టి ప్లాప్ అవడంతో ఈ అమ్మడి కెరీర్ డైలమా లో పడింది.

ఇప్పుడు నాగ చైతన్య తో చేస్తున్న “కస్టడీ” పైనే కృతి శెట్టి ఆశలన్నీ ఉన్నాయి. మే 12 న విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించిన అండర్ వాటర్ సీక్వెన్స్ మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. ఈ మేకింగ్ లో హీరో ఇతర నటులతో పాటు కృతి శెట్టి కూడా ఉంది. ఈ వాటర్ సీన్ లో తాను కూడా చాలా కష్టపడిందని వీడియో చూస్తే అర్థమవుతుంది. పైగా కృతి శెట్టి ఇందులో డీ గ్లామరైజ్ రోల్ లో నటించింది. మరి కృతి శెట్టి కష్టానికి తగ్గ ఫలితం వస్తుందో లేదో మరి కొద్దీ గంటల్లో తెలిసిపోతుంది. ఏది ఏమైనా టాలెంట్ ఉన్న కృతి శెట్టికి ప్లాప్ లు మాత్రం శాపం గా మారాయి. కస్టడీ ఫలితం తో హిట్ ట్రాక్ ఎక్కి మళ్ళీ తన గోల్డెన్ లెగ్ ట్యాగ్ ను సొంతం చేసుకోవాలని చూస్తుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు