Tollywood : చిన్న హీరోల మల్టీ స్టారర్ లోడింగ్..ఓపెనింగ్ కూడా ఫిక్స్..

Tollywood : టాలీవుడ్ లో ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే మల్టి స్టారర్ ల సంఖ్య తక్కువే అని చెప్పాలి. ఈ జెనరేషన్ లో ఇప్పుడిప్పుడే మల్టి స్టారర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా RRR సినిమాల తరవాత మల్టి స్టారర్ లపై క్రేజ్ పెరిగింది. దర్శక, నిర్మాతలు కూడా మల్టీ స్టారర్ కథలు సిద్ధం చేస్తున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాలు అరుదుగా తెరకెక్కుతుంటాయి కానీ, చిన్న హీరోల సినిమాలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అయితే ఈ మధ్య అవి కూడా తగ్గిపోయాయి. మరీ చిన్న హీరోల సినిమాలు వస్తున్నాయి కానీ, ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న ప్రముఖ హీరోల సినిమాలు పెద్దగా రావడం లేదు. అయితే ఇప్పుడు చిన్న హీరోల కాంబోలో ఓ క్రేజీ మల్టి స్టారర్ తెరకెక్కబోతుంది.

Bellamkonda Srinivas - Nara Rohit - Manchu Manoj multi-starrer soon

చిన్న హీరోల మల్టి స్టారర్ లోడింగ్…

ఇక ఈ మధ్య అయితే చిన్న హీరోలకు సంబంధించి పూర్తి స్థాయిలో మల్టి స్టారర్ అయితే రాలేదు. బహుశా తెలుగులో (Tollywood) చివరగా “శమంతకమణి” అనే సినిమాలో ఎక్కువమంది హీరోలు కలిసి నటించారు. ఇక రెండేళ్ల కింద మహా సముద్రం అనే సినిమా రాగా అది ప్లాప్ అయింది. ఇప్పుడు చాలా రోజులకు మరో క్రేజీ మల్టి స్టారర్ లోడింగ్ అవుతుంది. బెల్లం కొండా శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల కాంబోలో ఓ క్రేజీ మల్టి స్టారర్ తెరకెక్కనుందని సమాచారం. ఇండస్ట్రీలో ఈ హీరోలకు మంచి గుర్తింపు ఉన్నా, ఈ హీరోలు సక్సెస్ కొట్టి కూడా చాలా రోజులే అయింది. ఇప్పుడు వీర్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందట.

- Advertisement -

ఓపెనింగ్ కూడా ఫిక్స్…

ఇక బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ల కాంబో ఇండస్ట్రీలో వైరల్ అవుతుండగా, ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇతను ఇంతకు ముందు అల్లరి నరేశ్ తో నాంది, ఉగ్రం సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఈ మల్టి స్టారర్ సినిమా సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కనుండగా, ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 19న ఓపెనింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘గరుడన్’ కి రీమేక్ గా తెరకెక్కనుందని సమాచారం. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ ముగ్గురు కలిసి సక్సెస్ కొట్టి కూడా  చాలా రోజులవగా, అందరూ కలిసైనా కం బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు