Bellamkonda Srinivas: చావు కబురు దర్శకుడు మెల్లగా మరో సినిమా మొదలు పెట్టాడు

Bellamkonda Srinivas: అల్లుడు శ్రీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సాధించుకుంది. ఈ సినిమాకి కథను బాబి అందించాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సమంత హీరోహిన్ గా నటించింది. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాసును హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా తర్వాత చేసిన స్పీడున్నోడు సినిమా పర్లేదు అనిపించుకుంది ఆ తర్వాత చేసిన జయ జానకి నాయక సినిమా మంచి హిట్ అనిపించింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు.

కవచం, సీత, రాక్షసుడు, సాక్ష్యం వంటి సినిమాలు అంతంత మాత్రాన్ని ఫలితాన్ని తీసుకొచ్చాయి. శ్రీనివాస్ చేసిన సినిమాలు థియేటర్లో కంటే యూట్యూబ్ లోనే ఎక్కువ ఆదరణను సాధించాయి. నార్త్ లో అయితే యూట్యూబ్లో ప్రతి సినిమా కూడా కొన్ని మిలియన్ న్యూస్ దాటింది. ఈ సందర్భంగా నార్త్ లో కూడా ఫలితాన్ని సాధించాలని ఉద్దేశంతో సూపర్ హిట్ అయిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో నిర్మించారు. ఈ సినిమా అక్కడ ఊహించిన ఫలితాన్ని అందించలేదు

ఛత్రపతి సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ని ఒక కొత్త స్టార్ గా ఎదిగేలా చేసింది. ఈ సినిమా తర్వాతే ప్రభాస్ లెవెల్ కూడా మారిపోయిందని కొంతమంది చెబుతూ ఉంటారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కు సంబంధించిన కొత్త సినిమా ముహూర్తం పూర్తయింది. బెల్లంకొండ శ్రీనివాస్ చావు కబురు చల్లగా ఫేమ్ పెగళ్లపాటి కౌశిక్ తో సినిమాను చేయనున్నట్లు వచ్చిన వార్తలు నిజమయ్యాయి.

- Advertisement -

Bellamkonda Srinivas: The director of Chau Kaburu is slowly starting another film

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కొద్దిసేపటి క్రితమే పూర్తయ్యాయి. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అలాగే ఈ సినిమాకి కాంతారా సినిమాతో సంచలనం సృష్టించిన అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సైన్ స్క్రీన్ స్టూడియోస్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు