Happy Birthday Srinivas Avasarala: మల్టీ టాలెంటెడ్ పర్సన్

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మ సినిమాతో నటుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్ అవసరాల. ఆ సినిమాతో గుర్తింపును సాధించుకున్న శ్రీనివాస్ ఆ తర్వాత వంశీ దర్శకత్వంలో సరదాగా కాసేపు అనే సినిమాను చేశాడు ఏ సినిమా కూడా శ్రీనివాస్ అవసరాలకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.

శ్రీనివాస్ అవసరాల కెరియర్ లో గుర్తింపు తీసుకొచ్చిన పాత్రలు చాలా ఉన్నాయి. అయితే అన్నిటిని మించి పిల్ల జమిందార్ సినిమాలో శ్రీనివాస్ అవసరాల పాత్రకు మంచి గుర్తింపు లభించిందని చెప్పొచ్చు. 2008లో నటుడుగా కెరియర్ ను మొదలుపెట్టిన శ్రీనివాస్ అవసరాల, 2014లో దర్శకుడిగా తన తొలి ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే.

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడుగా తన ప్రతిభను నిరూపించుకున్నాడు శ్రీనివాస్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని చాలామంది ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాతోనే రాశి కన్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. యంగ్ హీరో నాగశౌర్యకి కూడా మంచి గుర్తింపును తీసుకొచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో నటుడుగా కూడా చేసాడు శ్రీనివాస్.

- Advertisement -

ఇకపోతే శ్రీనివాస్ అవసరాలకు మంచి మ్యూజిక్ టెస్ట్ కూడా ఉందని చెప్పొచ్చు. ఆయన సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది అయితే ఇప్పటివరకు దర్శకుడుగా శ్రీనివాస్ అవసరాల మూడు సినిమాలను చేశాడు. వాటిలో ఈ మూడు సినిమాలు కూడా పరవాలేదు అనిపించుకున్నాయి కానీ డిజాస్టర్లైతే కాలేదు. శ్రీనివాస్ సంవత్సరాల దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు కూడా కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు.

ఈ మూడు సినిమాలలో పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే శ్రీనివాస్ రీసెంట్ గా దర్శకత్వం వహించిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజిక్ మాత్రం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ముఖ్యంగా కనుల చాటు మేఘమా పాటకి ఇప్పటికీ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు.

అంతేకాకుండా మదన కామరాజు సినిమాలోని నీలి మేఘమాలవో అనే పాటను, దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్ర గంటితో పాడించాడు శ్రీనివాస్. బేసిక్ గా శ్రీనివాస్ అవసరాలకి కిషోర్ కుమార్ అంటే చాలా ఇష్టం.దానిని డైవర్ట్ చెయ్యడానికి మనమీదకి మహమ్మద్ రఫీ ను రుద్దుతాడు. “Chaudhvin ka chand ho” అని మహమ్మద్ రఫీ పాడిన పాటకు తెలుగు version నీలి మేఘమాలవో పాట.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు