Bhagyashri Borse: నక్క తోక తొక్కింది మామా.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. !

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే.. ఈ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఈ కుర్ర హీరోయిన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా మరో సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమాలు ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ , మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్ ‘.. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. . వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. తాజాగా ఓ భారీ బడ్జెట్ మూవీలో స్టార్ హీరో సరసన నటించే ఆఫర్ ను అందుకుంది.. డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి..

Bhagyashree Borse who got a chance in Dulquer Salmaan's movie
Bhagyashree Borse who got a chance in Dulquer Salmaan’s movie

అమెరికా బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రాబోతున్నఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది.. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో టాక్.. ఇదే కాదు గౌతమ్ తిన్ననూరి , రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.. ఈ అమ్మడు జోరు చూస్తుంటే అతి త్వరలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను అందుకోబోతుందని తెలుస్తుంది. అలానే సుజీత్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. ఈ చిత్రంలో కూడా భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమాల్లో ఒక్క హిట్ సినిమా పడితే అమ్మడు రేంజ్ ఎక్కడికో వెళ్తుంది.. మరో శ్రీలీల అవ్వడం పక్కా అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు