BhagyaSree Borse : సినిమాలో ఏమోగానీ ఎక్కడికెళ్లినా డాన్స్ ఇరగదీస్తుంది..

BhagyaSree Borse : టాలీవుడ్ లో ప్రభాస్ కల్కి తర్వాత పెద్దగా అంచనాలున్న సినిమాలేవీ థియేటర్లలో రాలేదు. అయితే ఇప్పుడు రాబోయే ఆగష్టు 15న మూడు క్రేజీ బడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ‘భాగ్యశ్రీ బోర్సే’ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఇదే ఈమెకు మొదటి సినిమా. ఇక ఈ సినిమా మొదలైనప్పటినుండే ఈ హీరోయిన్ పై మంచి క్రేజీ బజ్ మొదలయిందని చెప్పాలి. చాలా మంది నెటిజన్లు ఈ హీరోయిన్ కి టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉందని లెక్కేలేసి చెప్తున్నారు. ఇక ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ లో చేస్తూనే మరో రెండు తెలుగు సినిమాలకు కూడా సైన్ చేసింది భాగ్యశ్రీ.

BhagyaSree Borse danced at Mr. Bachchan's movie teaser launch event

మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల…

ఇదిలా ఉండగా రవితేజ, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ టీజర్ ని ఈరోజు మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే రిలీజైన గ్లిమ్స్ కి, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా టీజర్ రిలీజ్ అయ్యాక చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వచించారు. ఇక ఆ ప్రెస్ మీట్ లో సినిమా గురించి మీడియా నుండి ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.

- Advertisement -

స్టెప్పులేసిన భాగ్యశ్రీ…

ఇదిలా ఉండగా ఈ ప్రెస్ మీట్ లో టీజర్ లాంచ్ అయ్యాక ఈవెంట్ లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాలో ‘రెప్పల్ డప్పుల్’ సాంగ్ కి డాన్స్ వేయడం జరిగింది. ఈ డ్యాన్స్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక సినిమాలో ఏమో గాని భాగ్యశ్రీ స్టెప్పులతో అదరగొట్టిందని చెప్పాలి. ఇక మిస్టర్ బచ్చన్ హిట్ అయితే భాగ్యశ్రీకి టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఆఫర్లు వస్తాయని నెటిజన్లు అంటున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ ను వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మసిస్తుండగా, ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు