BhagyaSree Borse : అదిరిపోయే స్టెప్పులే కాదు.. క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకుంది..

BhagyaSree Borse : మాస్ మహారాజ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో “మిస్టర్ బచ్చన్” అనే యాక్షన్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుండగా, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలు లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి చిత్ర యూనిట్ హీరోహీరోయిన్లు అందరూ విచ్చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ‘భాగ్యశ్రీ బోర్సే’ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. తెలుగులో ఇదే ఈమెకు మొదటి సినిమా. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా మొదలైనప్పటినుండే ఈ హీరోయిన్ పై మంచి క్రేజీ బజ్ ఉండగా, ఈ సినిమా ప్రతి ప్రమోషన్లలో కూడా భాగ్యశ్రీ ఆకట్టుకుంటుంది. తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగ్య శ్రీ వన్ అఫ్ ది హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.

Bhagyasree Borse speech at the pre-release event of Mr. Bachchan movie

అదిరిపోయే స్టెప్పులేసి భాగ్య శ్రీ..

ఇక భాగ్య శ్రీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వన్ అఫ్ ది హైలెట్ గా నిలవగా, ఈ ఈవెంట్ లో స్టేజిపై అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఈ సినిమా కొరియోగ్రాఫర్ హీరోయిన్ ని స్టేజిపైకి రమ్మనగా, పైకి వచ్చిన భాగ్య శ్రీ, మిస్టర్ బచ్చన్ లో రెప్పల్ డప్పుల్ సాంగ్ కి, అలాగే నల్లంచు చీర సాంగ్ కి స్టెప్పులేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇంతకు ముందు కూడా భాగ్యశ్రీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో తన స్టెప్పులతో అదరగొట్టిందని చెప్పాలి. డాన్స్ విషయంలో భాగ్య శ్రీ స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చేలా ఉందని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

క్యూట్ స్పీచ్ తో అదరగొట్టిన బ్యూటీ..

ఇక భాగ్య శ్రీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్త ప్రిపేర్ అయి వచ్చినట్టుంది. కాస్త తెలుగులో బాగానే మాట్లాడ్డానికి ట్రై చేసింది. ఇక భాగ్య శ్రీ మాట్లాడుతూ.. ముందుగా హరీష్ శంకర్ గురించి చెప్తూ.. తనని ఈ బ్యూటీ ఫుల్ వరల్డ్ లో పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక రవితేజ గురించి చెప్తూ.. మై హీరో.. నిజానికి మీరు మాస్ మహారాజ.. అందుకే నన్ను మహారాణిలా చూసుకున్నారు, అంటూ ప్రశంసించింది. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు ఓ డ్రీం లాంటిది.. ఎందుకంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నా పేరెంట్స్ కూడా వచ్చారు అని భాగ్య శ్రీ చెప్పుకొచ్చింది. ఇక మిస్టర్ బచ్చన్ ను వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిసిస్తుండగా, ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు