Bhagyasree: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ను రూల్ చేద్దాం అని ఫిక్స్ అయి వచ్చినట్లుంది

Bhagyasree: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. కొన్నిసార్లు మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కూడా సరైన అవకాశాలు రావు. అలా మొదటి సినిమాతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. రామ్ చరణ్ తో చిరుత సినిమాలో కనిపించిన నేహా శెట్టి ఆ తర్వాత పెద్దగా గుర్తింపు ఉన్న సినిమాలు చేయలేకపోయింది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శాలిని పాండే తను కూడా ఎక్కువ సినిమాలు చేయలేకపోయింది. ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ఎక్కువ సినిమాలు చేసినా కూడా ఆ సినిమా తర్వాత సరైన గుర్తింపు ఒక సినిమా కూడా తీసుకురాలేదు.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఫెయిల్యూర్ తో స్టార్ట్ చేసి అద్భుతమైన ప్రాజెక్టులు పట్టుకున్న హీరోయిన్ అంటే రీసెంట్ టైమ్స్ లో శ్రీ లీల పేరు చెప్పొచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. అయినా కూడా వరుస అవకాశాలు శ్రీ లీలకు వచ్చాయి. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా అవకాశాలు లభించాయంటే అది మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ. మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ.

Bhagyashri Borse

- Advertisement -

మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఎక్కడ చూసినా కూడా భాగ్యశ్రీ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుంది. డాన్సులు వేయడం అలానే క్యూట్ క్యూట్ ఆన్సర్స్ ఇవ్వడం, స్పీచ్ కూడా బాగా మాట్లాడగలను ఇవన్నీ కూడా ఈ అమ్మాయికి అద్భుతమైన ప్లస్ అని చెప్పొచ్చు. ఇకపోతే భాగ్యశ్రీ మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే తెలుగులో దాదాపు మూడు నాలుగు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసింది. అందులో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా భాగ్యశ్రీ ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజెన్స్ ఇండస్ట్రీని రూల్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయి వచ్చినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు