Bhagyasri Borse : ఆ యాడ్ లో మెరిసిన రవితేజ బ్యూటీ.. అస్సలు నమ్మలేరు..

Bhagyasri Borse : బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ అమ్మడు తెలుగులో రవితేజ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. మాస్ మహారాజ రవితేజ , మాస్ డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్ ‘ . ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఈ బ్యూటీని తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. అందులో హీరోయిన్ లుక్ ఆసక్తిగా ఉండటంతో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ హీరోయిన్ గురించి యూత్ తెగ గూగుల్ లో వెతికేస్తున్నారు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి చూసేద్దామా..

భాగ్యశ్రీ బోర్సే పూణే కు చెందిన అమ్మాయి.. ఆమె వయసు 33 సంవత్సరాలు. ఇటీవలనే బాలీవుడ్ సినిమా యారియాన్ 2 హిందీ సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో ఆమె నటనకు, అందాల ఆరబోతకు మంచి రెస్సాన్స్ వచ్చింది.. ఆ సినిమాను చూసిన డైరెక్టర్ హరీష్ శంకర్ ఆమెను రవితేజకు జోడిగా సెలెక్ట్ చేసుకున్నారు.. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఈమె ఫిక్స్ చేసుకుంటున్నారు. నాని, విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలు ఈమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Bhagyashree Borse Dairy Milk Add Photo Viral
Bhagyashree Borse Dairy Milk Add Photo Viral

అయితే ఈమె గురించి ఎవరికీ తెలియని ఒక నిజం ఉంది.. అదేంటంటే ఆమె మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఈ అమ్మడు సినిమాల కన్నా ముందు ఓ యాడ్ చేసింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్‌తో ఈ బ్యూటీ ఎక్కువగా ఫేమస్ అయింది. ఆ యాడ్ లో ఆమె అందానికి ఫిదా అయిన బాలీవుడ్ డైరెక్టర్ యారియాన్ 2లో ఛాన్స్ ఇచ్చారు.. ఆ సినిమాతో మంచి టాక్ ను అందుకుంది. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమాల్లో ఒక్క సినిమా హిట్ అయితే మాత్రం అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు