Bhaje Vaayu Vegam: హ్యాపీ డేస్ హీరో వేగం పెంచింది

Bhaje Vaayu Vegam: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు కెరియర్ ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. కెరియర్లో హీరోగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరును సంపాదించుకున్న నటులు కూడా ఒక్కోసారి కనుమరుగైపోతుంటారు. కొంతమందికి మొదటి సినిమాతో మంచి గుర్తింపు లభించినా కూడా తరువాత వరుస అవకాశాలు వస్తాయి అని చెప్పలేము. ఫ్లాప్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. హిట్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఫెయిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. ఇకపోతే శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కొత్త వాళ్లను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు శేఖర్.

సోలో హీరోగా కూడా సినిమాలు చేశారు

శేఖర్ కమ్ముల తన కెరియర్ లో ఎన్నో సినిమాలను చేశారు అయితే శేఖర్ కమ్ముల చేసిన సినిమాల్లో బెస్ట్ ఫిలిం అంటే ఇప్పటికీ చాలామంది చెప్పేది హ్యాపీడేస్. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని కళ్ళకు కట్టినట్లు చూపించి అందరిని తన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు శేఖర్. ఈ సినిమాలో అన్ని అంశాలు కూడా అందరికీ టచ్ అయ్యేవిధంగా ఉంటాయి. ఒక కాలేజ్ లైఫ్ ఇంత అందంగా ఉంటుందా అని చాలామంది ఊహించి బీటెక్ కూడా జాయిన్ అయిపోయిన జనాలు ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపించిన నిఖిల్, వరుణ్ సందేశ్ వంటి హీరోలు తర్వాత సొలోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టారు.

రాహుల్ టైసన్

హ్యాపీ డేస్ సినిమాలో టైసన్ అనే పాత్రలో కనిపించాడు రాహుల్. ఈ సినిమాలో రాహుల్ పాత్రకి మంచి గుర్తింపు లభించింది. తనకంటే సీనియర్ ను లవ్ చేస్తుంటాడు. ఈ సినిమాలో రాహుల్ పాత్రను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు శేఖర్. అయితే ఈ సినిమా తర్వాత రాహుల్ కి సోలో హీరోగా సినిమా అవకాశాలు వచ్చాయి కానీ ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. వెంకటాపురం అనే ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది కానీ ఆ తర్వాత రాహుల్ మళ్లీ పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు.

- Advertisement -

Happy Days actor Rahul

భజే వాయువేగం సినిమాతో గుర్తింపు

రాహుల్ టైశన్ రీసెంట్ గా కనిపించిన సినిమా భజే వాయువేగం. ఈ సినిమాలో కార్తికేయకు అన్నయ్యగా కనిపించాడు. ఈ సినిమాలో కార్తికేయ పాత్రకు మంచి స్కోప్ ఉంది. అయితే మళ్లీ రాహుల్ కి అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం యు వి క్రియేషన్స్ లో ఒక సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లోనే వస్తున్న మరో సినిమా నిర్మాణంలో ఉండగా, వార్ బ్యాక్ డ్రాప్ లో ఒకటి, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా మరొకటి షూటింగ్ కు వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి.ఏదేమైనా ఈ సినిమాలు కూడా హిట్ అయి మంచి విజయాన్ని సాధిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాహుల్ నిలబడినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు