Bhale Unnade: రాజ్ త‌రుణ్- లావ‌ణ్య క‌లిసే మూవీ ప్ర‌మోష‌న్ కోసం కాంట్రవ‌ర్సీ డ్రామా ఆడారా?

Bhale Unnade: ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి గుర్తింపు సాధించుకొని ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. రాజ్ తరుణ్ కి వరుసగా అవకాశాలు తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత రాజ్ తరుణ్ వరుసగా సినిమాలు చేశాడు. ఆ సినిమా తర్వాత చేసిన సినిమా చూపిస్తా మామ(Cinema Chupistha Mama), కుమారి 21ఎఫ్(Kumari 21f) వంటి సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి.

అయితే రాజ్ తరుణ్ కెరియర్ లో ఉయ్యాల జంపాల(Uyyala Jampala), కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మామ ఈ సినిమాలు తర్వాత సరైన ప్రాపర్ హిట్ సినిమా ఇప్పటివరకు ఒకటి కూడా పడలేదు. సినిమాలు వస్తున్నాయి కానీ వచ్చిన సినిమాలు వచ్చినట్లే వెళ్ళిపోతున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ తరుణంలో ఎప్పుడో ఆగిపోయిన సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమయ్యాయి.

రీసెంట్ గా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనతో దాదాపు 11 సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ రిలేషన్ షిప్ లో ఉండి ఇప్పుడు ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడు అని లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేసింది. ఆ వివాదం అక్కడితో ఆగకుండా చాలామంది ఇన్వాల్వ్ అయ్యేలా చేసి డ్రగ్స్ వంటి అంశాలు కూడా ఈ వివాదంలో చోటుచేసుకున్నాయి. వీళ్ళపై పెద్ద ఎత్తున టీవీల్లో డిబేట్ కూడా జరిగింది. ఒక్కసారిగా రాజ్ తరుణ్ పై అందరి చూపు పడింది.

- Advertisement -

Bhale Unnade

ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ చేస్తున్న సినిమా భలే ఉన్నాడే(Bhale Unnade). ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన వీడియోలో కూడా హీరోయిన్ ఈ ఇష్యూ ని రిలేటెడ్ గా వాడుకుంది. అయితే భలే ఉన్నాడే సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇదంతా చేసారా అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం ఇస్తూ అస్సలు కాదండి అలా చేయాలని ఎవరనుకుంటారు దానికి దీనికి అసలు సంబంధం లేదు అంటూ జవాబు ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు