Bhale Unnade: చెప్పను సిస్టర్, అల్లు అర్జున్ కి రాజ్ త‌రుణ్ ఇండైరెక్ట్ కౌంటర్

Bhale Unnade: శివ సాయి వర్ధన్ (Siva Sai Vardhan) దర్శకత్వంలో రాజ్ తరుణ్(Raj Tharun) హీరోగా చేస్తున్న సినిమా భలే ఉన్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కొంతమేరకు సినిమా మీద మంచి అంచనాలని ఉంచింది అని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో రాజ్ తరుణ్ హిట్ సినిమా చేసి చాలా ఏళ్లు అయింది. ఎన్నో అంచనాలతో చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఒకవైపు సినిమాల్లో సక్సెస్ లేక మరోవైపు ఎక్కువ కాంట్రవర్సీలలో కూడా ఇరుక్కుపోయాడు రాజ్ తరుణ్.

ఇక రీసెంట్ గా లావణ్య(Lavanya) అనే ఒక అమ్మాయి రాజధాని తనతో పాటు దాదాపు 11 ఏళ్లు పాటు కలిసి ఉండి, ఇప్పుడు వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కూడా కోర్టులో తిరుగుతుంది. అయితే వీరిద్దరి మధ్య మొదలైన ఈ కేస్ అనేకమంది ఇన్వాల్వ్ అయ్యేటట్లు జరిగి డ్రగ్స్ వంటి అంశాలు కూడా ఈ కేసులో చోటుచేసుకున్నాయి. వీటి పైన పెద్దపెద్ద డిస్కషన్స్, డిబేట్స్ కూడా జరిగాయి. ఈ ఇష్యూ అంతా కూడా రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడు అని అంశంపైనే తిరిగింది.

Raj Tharun

- Advertisement -

ఇక రాజ్ తరుణ్ గతంలో పెళ్లి గురించి చాలా సందర్భాల్లో తాను పెళ్లి చేసుకోను అని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెబుతూ వచ్చాడు. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ చేస్తున్న భలే ఉన్నాడు(Bhale Unnade) అనే సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఒక ప్రెస్ మీట్ ని కండక్ట్ చేసింది చిత్ర యూనిట్ ఆ ప్రెస్ మీట్ లో ఒక లేడీ జర్నలిస్ట్ పెళ్లి మీద మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు. దానికి రాజ్ తరుణ్ సమాధానం ఇస్తే చెప్పను సిస్టర్ అని చెప్పాడు. అయితే గతంలో అల్లు అర్జున్(Allu Arjun) ను పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ప్రస్తావించమని అడిగినప్పుడు చెప్పను బ్రదర్ అన్నాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ వేరే అంశంపై చెప్పండి సిస్టర్ అన్నాడు. ఇప్పుడు దానితో దీనిని కంపేర్ చేస్తూ ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ కు రాజ్ తరుణ్ సెటైర్ వేశాడా అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు