Bharateeyudu 2 : ఇట్స్ అఫీషియల్.. ‘భారతీయుడు 2’ ట్రైలర్ డేట్ లాక్..!

Bharateeyudu 2 : తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘భారతీయుడు 2 ‘.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను ఇస్తూ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రాబోతుందని పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది…

తెలుగులో 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా రాబోతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఈ సినిమాను ఎట్టకేలకు జూలై 12 న విడుదల చెయ్యనున్నారు .. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.. సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.. గతంలో విడుదల చేసిన సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆరోజుల్లో జరిగే యుద్ధం గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు..

ఈ సినిమా ఎప్పుడో మొదలైంది.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు.. ఏదొక కారణం వల్ల విడుదల తేదీ వాయిదా పడుతుంది.. ఇప్పటికి ఒక క్లారిటిని శంకర్ ఇవ్వలేదు.. మొదట 2024 ఏప్రిల్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు.. ఎన్నికల కారణంగా వాయిదా పడింది.. తాజాగా ట్రైలర్ డేట్ ను పిక్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ నెల 25 న ట్రైలర్ విడుదల కాబోతుంది.. ఇకపోతే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు