Bharateeyudu2 : ఇది కదా శంకర్ సినిమా అంటే, సేనాపతి సంచలనం ఖాయం

Bharateeyudu2 : ప్రతి దర్శకుడికి తన కెరియర్లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. కొందరు దర్శకులకి అన్ని సినిమాలు ప్రత్యేకమే అని చెప్పొచ్చు. శంకర్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. శంకర్ చేసిన కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఉండే కంటెంట్ అని చెప్పొచ్చు. తమిళ్తోపాటు తెలుగులో కూడా ఆ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అని అంటేనే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. శంకర్ దర్శకత్వం వహించిన సినిమా భారతీయుడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Bharateeyudu2 Movie Trailer Out Now

అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. ఈ సినిమాలు కమలహాసన్ నటించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేము. అంత యూనిక్ కాన్సెప్ట్ ను ఎంచుకొని దాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు శంకర్. ఇప్పుడు చూసినా కూడా శంకర్ కి అంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు సినిమా రానున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ షూటింగ్ ఉన్నంతవరకు కూడా జరుగుతూనే ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

ఎట్టకేలకు ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అంచనాలకు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ ఉంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న చాలా లోటుపాట్లను ఈ సినిమాలో ప్రశ్నిస్తూ, వీటన్నిటినీ కరెక్ట్ చేయడానికి ఒకరు ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్న తరుణంలో సేనాపతి ఎంట్రీ ఇవ్వడం ఈ ట్రైలర్ కి ఒక హై పాయింట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చాలా పరిణామాలకి సేనాపతి పరిష్కారం ఎలా ఉంటుందో శంకర్ చూపించే ప్రయత్నం చేశాడు.

మామూలుగా శంకర్ సినిమాలు అంటే సమాజానికి ఏదో ఒకటి చెప్పే విధంగా ఉంటాయి అచ్చం భారతీయుడు 2 కూడా అదే మాదిరిగా ఉంది అని చెప్పొచ్చు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు శంకర్. ఒక కమల్ హాసన్ సేనాపతి గెటప్ లో ఆశ్చర్యాన్ని కలిగించాడు. తెలుగువాళ్లు లవర్ బాయ్ గా పిలుచుకొని సిద్ధార్థ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ ట్రైలర్ కి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి రెడీ అవుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు