Bharateeyudu2 : ‘భారతీయుడు2’ ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్… నిడివి ఎంతంటే?

Bharateeyudu2 : ఉలగనయగన్ కమల్ హాసన్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇండియన్2 మరో నాలుగు వారాల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 సినిమా తెరకెక్కగా, కమల్ హాసన్ తో పాటుగా కాజల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ఎస్.జె. సూర్య, బాబీ సింహ వంటి తారాగణం నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పటివరకూ వచ్చిన వచ్చిన టీజర్, సాంగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. ఫైనల్ గా జులై 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదల కానుంది. అయితే కొన్ని రోజుల కిందట ఇండియన్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తమిళ్ లో గ్రాండ్ గా నిర్వహించడం జరిగింది. కానీ ఆ తర్వాత శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా భారతీయుడు2 ట్రైలర్ కి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది.

Bharateeyudu2 Movie Trailer Release Update

ట్రైలర్ రిలీజ్ ఆరోజునే?

అయితే భారతీయుడు2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా నిర్వహించలేదు గాని, అప్పుడే ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించి తాజాగా అభిమానులకు క్రేజీ అప్డేట్ వచ్చింది. భారతీయుడు2 సినిమా నుండి ఇప్పటివరకూ ఒక టీజర్, రెండు పాటలు మినహా వేరే ఏమి రిలీజ్ కాలేదు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం పెట్టేసారు. ఇక భారతీయుడు2 ట్రైలర్ జూన్ 24 సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్య ప్రాంతంలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ట్రైలర్ నిడివి 2 నిమిషాల 36 సెకన్లు ఉండనుందని సమాచారం. ఇక ట్రైలర్ ని ముంబై లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఈ ట్రైలర్ గురించి కమల్ హాసన్ ఫాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లోనూ ఇప్పటినుండే క్యూరియాసిటీ మొదలైంది. టీజర్ తో ఆల్రెడీ శంకర్ మార్క్ ఎలివేషన్లతో మెప్పించగా ట్రైలర్ ఏ రేంజ్ లో రెడీ చేస్తారో చూడాలి మరి. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కోడోత్ వచ్చింది.

- Advertisement -

భారతీయుడు2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆరోజున?

ఇక ఇండియన్2 (Bharateeyudu2) షూటింగ్ మొత్తం పూర్తయ్యాక రీసెంట్ గా చైన్నైలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. అయితే తెలుగులో మాత్రం ఇప్పటివరకూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీ అయ్యాడు. అయితే తాజాగా భారతీయుడు2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజా సమాచారం వచ్చింది. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో జూన్ 30న నిర్వహించే అవకాశం ఉందని లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆ డేట్ కరెక్ట్ ని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే దానికి మూడు రోజుల ముందే కమల్ విలన్ పాత్ర లో నటించిన కల్కి2898AD కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి, ఆ ఊపులో కమల్ హాసన్ సినిమాకి మరింత ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో క్లారిటీ రావాలి. ఇక భారతీయుడు2 సినిమా రిలీజ్ అయ్యాకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు