Bharatheeydu 2 Ticket Rates : భారతీయుడు 2 టికెట్ రేట్లు పెంపు… తెలంగాణలో ఎంత పెరిగాయంటే?

Bharatheeydu 2 Ticket Rates : భారతీయుడు-2 మూవీ ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తెలుగు, తమిళ భాషల్లో జోరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా భారతీయుడు-2 టికెట్ రేట్లను తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మరి తెలంగాణలో భారతీయుడు-2 టికెట్ రేట్లు ఎంత పెరిగాయో తెలుసుకుందాం.

పెరిగిన టికెట్ రేట్లు

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఇండియన్ 2. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారతీయుడు 2 చిత్ర బృందానికి గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో ఉన్న మల్టీప్లెక్స్ లో రూ. రూ. 75, సింగల్ స్క్రీన్ లలో రూ. 50 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఈ పెంపుదల జూలై 12 నుండి ఒక వారం పాటు వర్తిస్తుంది.

ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ సీఎం డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సహకరించాలని, అప్పుడే టికెట్ రేట్లు పెంచుతామని కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రకని లాంటి యాక్టర్స్ యాంటీ డ్రగ్స్ పై వీడియోను రిలీజ్ చేసి వదిలారు. ఇక తాజాగా టికెట్ల పెంపుతో పాటు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోకు కూడా ఓకే చెప్పడం విశేషం.

- Advertisement -

Bharateeyudu 2: భారతీయుడు 2 రిలీజ్ డేట్ చూసాక రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి.! - Telugu News | Kamal Haasan Bharateeyudu 2 movie release date update Telugu Heroes Photos | TV9 Telugu

టికెట్ రేట్ల పెంపుపై అసంతృప్తి

సామాజిక సమస్యలతో కూడిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో నైపుణ్యం ఉన్న దేశంలోని అతి కొద్దిమంది దర్శకుల్లో శంకర్ కూడా ఒకరు. ఈ దర్శకుడికి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఆయన ఎంత పాపులర్ అంటే స్టార్ హీరోల కంటే తక్కువేమీ కాదు. దర్శకుడు ఇప్పుడు భారతీయుడు 2తో 1996 సూపర్‌హిట్ భారతీయుడుకి సీక్వెల్‌తో వస్తున్నాడు. టీమ్ సినిమాని బాగా ప్రమోట్ చేసింది. కానీ శంకర్ గత చిత్రాలతో పోలిస్తే తెలుగులో భారతీయుడు 2కి అంతగా బజ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించడంలో చాలా జాప్యం జరిగింది.

అసలే సినిమాపై హైప్ లేదు. అయినప్పటికీ చూద్దాం అనుకున్న కమల్ అభిమానులకు తాజాగా పెరిగిన టికెట్ రేట్ ప్రేక్షకులలో నిరుత్సాహానికి కారణమైంది. తమ అసంతృప్తిని నెటిజన్లు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ టిక్కెట్టు రేట్ల పెంపుదల వల్ల పరిశ్రమకు మేలు కంటే నష్టమే ఎక్కువని, సినిమాలపై ఆసక్తిని చంపేస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాడుతో పోలిస్తే తెలంగాణలో భారతీయుడు 2 టికెట్ ధర ఎక్కువగా ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చినప్పటికీ, టికెట్ ధర ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం భారతీయుడు 2కు కష్టమనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు