Bhola Shankar: తమ్ముడుకి అభిమానిగా.?

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.
తెలుగు సినిమాకి మెగాస్టార్ లాంటి హీరో దొరకడం ఒక వరం.
కొన్నేళ్లు సినిమాకి గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ఖైదీ 150 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ తరవాత ఎన్నో సినిమాలను చేసిన మెగాస్టార్ కి పేరు తెచ్చింది మాత్రం వాల్తేరు వీరయ్య సినిమా మాత్రమే. దానికి ఆ సినిమాలో కమర్షియల్ హంగులు ఉండటం.

ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో కూడా అలాంటి కమర్షియల్ హంగులు ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ళు గ్యాప్ తరవాత మెహర్ దర్సకతవం వహిస్తున్నసినిమా ఇది. తమిళ్ లో అజిత్ సూపర్ హిట్ సినిమాకి వేదలమ్ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త చక్కెర్లు కొడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఉంటె ఫ్యాన్స్ కి ఇది ఒక విజువల్ ట్రీట్ అవుతుంది అని చెప్పొచ్చు. కానీ కొంతమంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మెగాస్టార్ ఏంటి పవన్ కి అభిమానిగా కనిపించడం ఏంటి అని కొంతమంది వాదన.
మెగాస్టార్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వాడుకోవడం ఏంటి అనేది ఇంకొంతమంది అభిప్రాయం. ఏదేమైనా ఈ విషయంలో అధికారిక క్లారిటీ వచ్చేవరకు ఇటువంటి సోషల్ మీడియా యుద్ధాలు తప్పవు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు