Chiranjeevi: ఆ రోజే భోళా మేనియా కి ముహూర్తం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ నా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. ఇక ఈ చిత్రం నుండి అభిమానులు చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం యొక్క మ్యూజిక్ పనులను మొదలు పెట్టామని ఈ మధ్యనే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ యొక్క ప్రోమోని జూన్ 2 న విడుదల చేస్తునట్టు అలాగే లిరికల్ సాంగ్ ని జూన్ 4న విడుదల చేస్తున్నటు చిత్ర యూనిట్ ప్రకటించింది.

భోళా శంకర్ యొక్క ఫస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్ గా, మెగాస్టార్ ని ఎలివేట్ చేసేలా ఉంటుందని అనౌన్స్ చేసిన పోస్టర్ లో స్టిల్స్ ని బట్టి తెలిసిపోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ 80 శాతానికి పైగా కంప్లీట్ అయిపోగా, మిగిలిన షూట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరిస్తారు. హీరో సుశాంత్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించగా, మురళి శర్మ, రావు రమేష్, రఘు బాబు, వెన్నెల కిషోర్ ,తులసి, బిత్తిరి సత్తి, ఉత్తేజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

భోళా శంకర్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అయితే ఇప్పటి వరకు మోషన్ పోస్టర్స్, స్టిల్స్ తోనే సరిపెట్టిన ఫ్యాన్స్ కు ఇకనుంచి పాటలు వీడియోలతో వారానికో అప్ డేట్ ని ఇస్తామని చిత్ర యూనిట్ తెలియచేసారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించగా, ఆగస్ట్11న ఈ సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు