Bhoomika Chawla.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఫ్రెష్ ఫేస్ గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక చావ్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నవ్వుతో, అందంతోనే అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది హీరోల తరఫున నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న భూమిక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా భూమికకు ఒక సినిమా షూటింగ్ సమయంలో సినిమాటోగ్రాఫర్ చేత ఘోర అవమానం ఎదుర్కొన్నదట. మరి అసలు విషయం ఏమైందో ఇప్పుడు చూద్దాం.
సినిమాటోగ్రాఫర్ చేతిలో భూమికకు అవమానం..
చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. హీరోయిన్లను అందంగా చూపించడానికి మేకప్ మెన్ లు, డైరెక్టర్లు , కెమెరామెన్లు ఎన్నో రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి హీరోయిన్ అందంగా కనిపించాలి. అలాంటి ఒక ప్రయోగమే చేశారు. మరి ఆ చిత్రం విషయానికొస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక కలసి జంటగా నటించిన చిత్రం ఖుషీ. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఇది ఒక మెమొరబుల్ మూవీ గా నిలిచిపోయింది. ఇందులో పవన్ కళ్యాణ్ , భూమిక వచ్చే ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ చేసే అల్లరి, భూమిక పర్ఫామెన్స్ అప్పటి యువతను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు .అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను భూమిక ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.
శ్రీరామ్ అదే అనేసరికి బాధేసింది – భూమిక
ఈ సినిమాకి పీసీ శ్రీరామ్ సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భూమిక ఒక గుడిలో దీపం ఆరిపోకుండా చేతులు అడ్డుపెట్టే సన్నివేశం ఉంది. ఆ సీన్ కోసం భూమిక కొద్దిగా మేకప్ వేసుకొని వెళ్లిందట. ఇది గమనించిన పిసి శ్రీరామ్ వెంటనే షూటింగ్ ఆపేసి, మేకప్ పూర్తిగా పోయేలా ముఖం కడగమని చెప్పారట. దాంతో లైట్ గా మేకప్ వేసుకున్నాను అని చెప్పినా ఆయన వినలేదట బహుశా ఆ సమయంలో ఆయన మూడ్ సరిగ్గా లేదేమో అని అనుకుందట భూమిక. అయితే ఆయన ఒక్కసారిగా ముఖం వెళ్లి కడుక్కో అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ తర్వాత అలవాటు అయిపోయింది అంటూ తెలిపింది. భూమిక.
భూమిక మేకప్ వేసుకోకుండా నటించిన ఏకైక సినిమా..
పీసీ శ్రీరామ్ నన్ను నాచురల్ గా చూపించడానికి ఇష్టపడ్డారు. ఖుషీ సినిమా మొత్తం కూడా నేను ఎక్కడ మేకప్ వేసుకోలేదు.. అక్కడక్కడ కేవలం కొన్ని సన్నివేశాలలో మాత్రమే , అది కూడా చాలా లైట్ గా మేకప్ వేసుకున్నాను. సినిమా మొత్తం నేను న్యాచురల్ గానే చేశాను అంటూ తెలిపింది భూమిక. మొత్తానికి అయితే సినిమా మొత్తం మేకప్ వేసుకోకుండా నటించిన భూమిక ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఏది ఏమైనా ఈ సినిమాలో ఈమె మేకప్ వేసుకోకపోయినా చాలా అందంగా కనిపించిందని చెప్పవచ్చు.