Manoj : మంచి రోజు కోసం వెయిటింగ్

మంచు మనోజ్.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వైవిద్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని, హీరోయిజాన్ని సొంతం చేసుకున్న మంచు మనోజ్, విడాకులతో ఒక్కసారిగా సంచలనానికి కారణమయ్యాడు. మనోజ్ కి 2017లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగిన సంగతి తెలిసిందేే. వీరిద్దరిది ప్రేమ పెళ్లి అన్న విషయం అందరికీ తెలుసు. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మొదట ప్రణతినే మనోజ్ కు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకువచ్చిందట. అయితే అప్పట్లో మోహన్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదట. కాగా మనోజ్ అందరినీ కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఒక సంవత్సరం పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఉద్యోగం కారణంగా ప్రణతి అమెరికాకు వెళ్ళింది. అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండడం.. మనోజ్ ఆ సమయంలో సినిమాలతో బిజీగా ఉండడంతో ఇద్దరికి కలిసి గడిపే సమయం దొరికేది కాదు. అదే ప్రణతికి పెద్ద సమస్యగా మారింది. ఇలా వీరిద్దరి మధ్య దూరం పెరిగి చివరకు విడాకుల వరకు వెళ్ళినట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి విడాకులు తీసుకున్నారని టాక్. అయితే మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా చాలా రోజుల నుండి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా దివంగత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఒక గణేష్ మండపం వద్ద కనిపించడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆమెతో కలిసి మంచు మనోజ్ పూజలు నిర్వహిస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అప్పుడే వార్తలు స్టార్ట్ అయ్యాయి. కాగా దీనిపై మంచు మనోజ్ “ఒక పర్సనల్ విషయం చెప్పాలి.. ఒక మంచి రోజున చెబుతా” అంటూ సమాధానం కూడా ఇచ్చాడు. దీంతో భూమా మౌనికతో మనోజ్ పెళ్లి దాదాపు ఖాయమని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు