Sardar2 : బిగ్ బ్రేకింగ్.. కార్తీ ‘సర్దార్ 2’ సెట్ లో ప్రమాదం.. ఒకరు మృతి..

Sardar2 : ప్రముఖ తమిళ హీరో కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు… ఈ సినిమా విడుదక తేదీని అనౌన్స్ చెయ్యడంతో షూటింగ్ ను శరవేగంగా ఫినిష్ చేసే పనిలో మేకర్స్ నిమగ్నమయ్యారు.. ఈ సినిమా షూటింగ్ భారీ సెట్ లో చిత్రీకరణం జరుపుకుంటుంది.. ఈ సెట్ లో తాజాగా భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలు తగినట్లు సమాచారం..

ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.. ఈ క్రమంలో సీన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తోన్న స్టంట్‌ మ్యాన్‌ ఎజుమలై ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు.. వెంటనే ఆ దృశ్యాన్ని గమనించి సర్దార్ 2 టీమ్ హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.. బాగా ఎత్తు పైనుంచి కింద పడటంతో అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

ఇక ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందండంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.. ప్రమాదం గురించి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేశారు.. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కార్తి హీరోగా 2022లో తెరకెక్కిన స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘సర్దార్‌’ సినిమాకు ఇది సీక్వెల్ గా రాబోతుంది… ఈ మూవీకి పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2’ ఇప్పుడు పట్టాలెక్కింది. ఎస్‌.జె.సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు