Manchu Vishnu : ట్రోల్స్ చేస్తున్న యూట్యూబర్‌పై యాక్షన్… అయినా మంచు విష్ణుకు వేధింపులు తగ్గలే..

Manchu Vishnu : సాదారణంగా సెలెబ్రేటీలు తమకు సైబర్ నేరగాళ్ళతో వేధింపులని సైబర్ పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు రివర్స్ అయ్యింది. సైబర్ క్రైమ్ పోలీసులు నుంచి సెలబ్రిటీలకే వేధింపులు వస్తున్నాయి. టాలీవుడ్ హీరో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణుకు ( Manchu Vishnu ) సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి వేధింపులు వస్తున్నాయనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “మా” తో పాటు సెలబ్రిటీలను అవమానిస్తూ వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్న విజయ్‌ చంద్రహాసన్‌ దేవరకొండను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దీని వల్ల మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఇబ్బందులు వస్తున్నాయట. అవి ఏంటో ఇప్పుడు చూద్ధాం…

గత కొన్ని రోజులుగా క్రితం మూవీ నటీనటుల పై అసభ్య కంటెంట్ తో వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై కొరడా జులిపించారు మంచు విష్ణు.. ఈ క్రమంలో ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ ను బ్యాన్ చెయ్యాలని యూట్యూబ్ కు విన్నవించారు. అలాగే సైబర్ క్రైమ్ ను అశ్రయించారు. ఇప్పుడు మరో న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. విజయ్‌ చంద్రహాసన్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వివిధ సోషల్‌మీడియా ఖాతాల్లో అనేక వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. వీటిలో మంచు విష్ణు, ఆయనకు సంబంధించిన నిర్మాణ సంస్థ, ‘మా’లతో పాటు సినీ రంగాన్నీ కించపరిచే, అవమానించే, అభ్యంతరకరంగా చిత్రీకరించే అంశాలను పొందుపరిచాడు..

Big breaking.. Cyber ​​crime police shocked Manchu Vishnu..
Big breaking.. Cyber ​​crime police shocked Manchu Vishnu..

ఇతని వీడియోలు రోజు రోజుకు ఎక్కువ కావడంతో మా అధ్యక్షులు మంచు విష్ణు సీరియస్ అయ్యాడు. సంస్థ ట్రెజరర్‌ శివబాలాజీ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా నుంచి ఫిర్యాదు రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కె.మధులత అనేక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడికి నోటీసులు జారీ చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే అవసరమైన ఆధారాలను సేకరించి, న్యాయ స్థానంలో పొందుపరుస్తామని చార్జ్ సీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసు విచారణ కోసం మా అధ్యక్షుడు మంచు విష్ణు తమ ముందు హజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప ( Kannappa ) సినిమాలో బిజీగా ఉన్నారు. ఎలాగైనా డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ చేయాలని కన్నప్ప మూవీ టీం ప్రయత్నిస్తుంది. ఈ టైంలో విచారణకు విష్ణు వస్తే… కన్నప్ప రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచనలో ఉన్నారట మంచు విష్ణు. దీనిపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు