Shankar : రామ్ చరణ్ “గేమ్ చెంజర్” సాంగ్స్ కి అన్ని కోట్లా.. !

శంకర్ సినిమాలలో సాంగ్స్ గురించి వాటికీ అయ్యే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన సినిమాలో ఒక సాంగ్ కి పెట్టె బడ్జెట్ తో కనీసం 2, 3 మూడు చిన్న సినిమాలు తీసేయచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలలో సాంగ్స్ కి చాలా కేర్ తీసుకుంటాడు.సాంగ్స్ కి వాడే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి , వేసుకునే కాస్ట్యూమ్స్ , లొకేషన్స్ ఇలా ప్రతి యాస్పెక్ట్ లో శంకర్ చాల పర్టిక్యూలర్ గా ఉంటాడు. అందుకే ఆయన సినిమాలో సాంగ్స్ మనం ఎప్పుడు విన్న, చుసిన చాలా ఫ్రెష్ ఫీల్ అవుతాం. ఆయన సినిమా బడ్జెట్ తో పాటు సాంగ్స్ కి కూడా సపరేట్ గా బడ్జెట్ వేస్తారు. అయితే ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా “ గేమ్ చెంజర్ “ RRR తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో మొత్తం అయిదు పాటలు ఉన్నాయంట. ఈ అయిదు పాటలను ఇండియాలో ఉన్న టాప్ 5 కొరియోగ్రాఫర్ లు అందరు కంపోస్ చేస్తున్నారు. పోటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ప్రతి విషయాన్నీ శంకర్ గారు దగ్గర ఉండి చూసుకుంటున్నరంట. రోబో-2 ఆశించినంత విజయం సాధించక పోయేసరికి ఆయన రామ్ చరణ్ సినిమాని సీరియస్ గా తీసుకుని చేస్తున్నారు.

ఈ సినిమాలో ఉన్న అయిదు పాటలకి గాను బడ్జెట్ అక్షరాలా 10 కోట్లు ఖర్చు అయ్యాయి అంట. అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమాకి ఇంత భారీగా ఖర్చు చేయడం ఇదే ఫస్ట్ టైం. శంకర్ గత చిత్రం రోబో-2 లో క్లైమాక్స్ లో వచ్ఛే సాంగ్ కి ఆయన అప్పట్లోనే 52 కోట్లు ఖర్చుపెట్టించాడట. కట్ చేస్తే ఆ సాంగ్ ఎండ్ టైటిల్స్ లో వచ్చింది. ఎండ్ టైటిల్స్ లో వచ్ఛే సాంగ్ కోసం ఇంత ఎందుకు ఖర్చు చేసారు అని అప్పట్లో అందరు షాక్ అయ్యారు.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు