Prabhas: ప్రభాస్ కల్కి చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ బడా హీరో..!!

Prabhas: ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో కల్కి 2898AD సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. సూపర్ హీరోస్ కథాంశంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో దిశాపటాని , దీపికా పదుకొనే , కమలహాసన్, అమితాబ్ బచ్చన్ వంటి వారు నటిస్తూ ఉండడంతో ఈ సినిమా పై భారీ హైప్ ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చిన్న గ్లింప్స్ విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీమహావిష్ణువుగా 11వ అవతారం కల్కి 2898 వ సంవత్సరంలో ఉంటారని సమాచారం.. కొన్ని కారణాల చేత ప్రస్తుత కాలంలోకి సైంటిస్టులు అతడిని తీసుకువస్తారని ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్టు-k గా ఉంటుందట. ఈ చిత్రంలో కమలహాసన్ షూటింగ్ పార్ట్ తప్ప ఇప్పటివరకు మిగిలిన పార్ట్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. అయితే ఈ చిత్రం విడుదల తేదీని మాత్రం ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు.

మొదట ఈ సినిమాలో ప్రభాస్ కంటే హీరోగా రామ్ చరణ్ ని అనుకున్నారట. ఎప్పుడో ఆరేళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ స్టోరీని రామ్ చరణ్ కు వినిపించారట. స్టోరీ చాలా బాగున్నప్పటికీ మొదటి సినిమానే ఇలాంటి పెద్ద సినిమా చేయగలరా లేదా అనే విషయం పైన రామ్ చరణ్ కు సందేహం ఉండేదట. అలా రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత వస్తే కచ్చితంగా ఈ సినిమా చేద్దామని చెప్పారట రామ్ చరణ్.

- Advertisement -

దీంతో నాగ్ అశ్విన్ మహానటి సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. ఆ వెంటనే ఇదే స్క్రిప్ట్ ని తీసుకువెళ్లి ప్రభాస్ కి వినిపించగా ఒక సింగిల్ సెట్టింగ్ లోనే ఈ సినిమా కథను ఓకే చేసి డేట్లు కూడా ఇచ్చేశారట.. అలా ఈ సినిమా అప్పుడు ప్రారంభమై ఇప్పటికి చేరుకుందని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు తెలుస్తోంది నాగ్ అశ్విన్.. దీంతో ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు