Allu Arjun: బన్నీకి 3 ఎదురుదెబ్బలు.. పవన్‌ తో పెట్టుకంటే అంతేనా.. ?

Allu Arjun: పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్… మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ… కేవలం అల్లు బ్రాండ్ ను మాత్రమే ప్రమోట్ చేసుకుంటారనే వార్త మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే ఈ తరుణంలోనే మొదటి నుంచి అల్లు ఫ్యాన్స్ కు, మెగా ఫ్యాన్స్ కు మధ్య హైట్ జరుగుతూనే ఉంటుంది. ఇక మొన్నటి వరకు ఏపీ ఎన్నికల్లో భాగంగా బన్నీ వర్సెస్ మెగా కుటుంబం మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో బన్నీ సపోర్ట్ చేసిన నంద్యాల అభ్యర్థి ఓడిపోయాడు.

దీంతో అల్లు అర్జున్ ను మరింతగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక అంతకుముందే కమిట్ అయిన సినిమాలకి పవన్ కళ్యాణ్ వాటిని త్వరలోనే కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ వర్సెస్ అల్లుఅర్జున్ అనే వార్త వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత అల్లు అర్జున్ కు అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Allu Arjun: One post.. are everyone's mouths shut..?

- Advertisement -

ఇక నంద్యాల వివాదం రోజురోజుకి మరింత పెద్దగా అయి మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య అంతులేని దూరాన్ని పెంచుతుందనే విషయాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా మెగా అభిమానులతో గొడవ పడుతుండడంతో పుష్ప సినిమా రిలీజ్ డేట్ ను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. ఇక అంతేకాకుండా అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా కూడా రద్దయిందట.

దానికి గల కారణం అల్లు అర్జున్ ఎక్కువగా పారితోషికం అడగడంతో ఆ నిర్మాణ సంస్థ సినిమానే వద్దని క్యాన్సల్ చేసుకున్నారట. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయాల్సి ఉందట. అయితే ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవడం వల్లే అల్లు అర్జున్ కి ఇలా ఒకటి తర్వాత మరొకటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు