Actress Divi : అప్పుడేమో మెగా హీరో.. ఇప్పుడేమో నందమూరి హీరో.. ఎవర్ని వదల్లేదుగా..

Actress Divi : టాలీవుడ్ లో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన ఆర్టిస్టులలో “దివి” కూడా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ఈమె పాపులర్ అయింది. అయితే అంతకు ముందే పలు సినిమాల్లో నటించినా కూడా ఏ ఒక్కటి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. కానీ బిగ్‌ బాస్ లో ఎప్పుడైతే ఈ అమ్మడు కనిపించిందో అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి పేరు మారుమోగుతూనే ఉంది. ఇక ఆ సీజన్ కి గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన దివి పెర్ఫార్మన్స్ కి మెచ్చుకుని తన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మంచి వేషం కూడా ఇచ్చారు. ఇక ఈ మధ్యనే ‘లంబసింగి’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన దివి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ వరుస సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా నందమూరి బాలకృష్ణను దివి ఆకాశానికి ఎత్తేసి పొగడ్తల వర్షం కురిపించింది.

Bigg Boss fame Divi praised actor Balakrishna

ఆయనొక లీడర్ మాత్రమే కాదు.. గొప్ప మనిషి – దివి..

ఇక బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ – బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న NBK109 ప్రాజెక్ట్ లో నటిస్తుంది. ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ బాబీ బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా సెట్స్ లో గ్రాండ్ గా జరిగాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బిగ్ బాస్ దివి బాలయ్యని ప్రశంసిస్తూ.. ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. బాలకృష్ణ గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పుకొచ్చింది. ‘జై బాలయ్య, డియర్ బాలకృష్ణ గారు అంటూ మొదలు పెట్టి.. బాలయ్య సినిమా సెట్స్ లో అందరితో ఎంతో ప్రేమగా ఉంటారో తెలిపింది. నందమూరి బాలయ్యను ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదని, ఆయన్ని కళ్ళతో కాకుండా మనసుతో చూసిన వాళ్ళకే ఎక్కువగా బాలయ్య అంటే ఏంటో తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక బాలయ్య ఒక లీడర్ గా మాత్రమే కాకుండా, ఒక గొప్ప మానవతా భావాలున్న మనిషి అంటూ దివి చెప్పుకొచ్చింది.

- Advertisement -

బాలయ్య తో ఫొటో షేర్ చేసిన దివి..

అలాగే బాలయ్య డెడికేషన్, ప్యాషన్, ఆదర్శవంతమైన రెస్పెక్ట్, హుందాతనం ఇలాంటివి ఎన్నో బాలయ్య నుండి నేర్చుకున్నా అని దివి చెప్పుకొచ్చింది. అలాగే డైరెక్టర్ బాబీ కి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ బాలకృష్ణ తో సెట్స్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది దివి. ఇక ఇంకా టైటిల్ ఖరారు కానీ NBK109 చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు