SyedSohel : ఆరోజు అలా చేసినందుకు ఫీల్ అవుతున్నాను – బిగ్ బాస్ సోహెల్

SyedSohel : టాలీవుడ్ లో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లలో సయ్యద్ సోహెల్ రియాజ్ ఒకరు. ఈ పేరు చాలా తక్కువ మందే విని ఉంటారు. కానీ బిగ్ బాస్ సోహెల్ అంటే తెలుగు ఆడియన్స్ కి అందరికి తెలుసు. షార్ట్ ఫిలిమ్స్ తో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమ్ సంపాదించిన ఈ నటుడు, బిగ్ బాస్ ద్వారా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి హీరోగా సినిమాలు కూడా చేసాడు. అయితే సినిమాలు చేసినంత మాత్రాన అందరికి సక్సెస్ రావాలని ఏమి లేదు. కొందరు బిగినింగ్ లోనే సక్సెస్ అవుతారు. మరి కొందరికి కాస్త టైం పడుతుంది. ఇంకొంతమంది నటుడు తమని తాము నిరూపించుకోవడానికి ఇప్పటికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సోహెల్ కూడా హీరోగా చేయగా, ఇప్పటివరకు సక్సెస్ రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయంపైన ప్రస్తావిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

Bigg Boss Fame Syed Sohel Latest Comment Viral on Social Media

ఆరోజు అలా చేసినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా – సోహెల్

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన సోహెల్ (SyedSohel) బుల్లితెరపై, అలాగే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో సోహెల్ కు సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చాయి. గుంటూరు మిర్చి, ఎరుక, లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్ వంటి సినిమాలలో హీరోగా చేసాడు సోహెల్. అయితే ఈ సినిమాలేవీ సక్సెస్ కాలేదు. చివరగా బూట్ కట్ బాలరాజు అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే లోపం వల్ల సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఆ టైం లో సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. థియేటర్ల వద్దకు వచ్చి నా సినిమా చూడండన్నా.. అంటూ ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసాడు. అయితే ఆ వీడియో నెట్టింట చాలా ట్రోల్ అయింది. నెటిజన్లు సోహెల్ బాగా ట్రోల్ చేసారు. తాజాగా సోహెల్ ఆ వీడియో గురించి రియాక్ట్ అయ్యాడు.

- Advertisement -

టైం తీసుకుని వస్తా…

అయితే బూట్ కట్ బాలరాజు సినిమా టైం లో చేసిన దానికి సోహెల్ రియాక్ట్ అవుతూ.. “ఆరోజు అలా చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆరోజు థియేటర్ల వద్ద అంత ఎమోషనల్ అవ్వాల్సింది కాదని… తన సినిమాలో మేటర్ లేకుంటే జనాలు మాత్రం థియేటర్లకు ఎలా వస్తారు… అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తమిళ్ లో తమిళ నటుడు ‘కెవిన్’ కూడా బిగ్ బాస్ నుండే సినిమాల్లోకి వచ్చాడు. మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాలు చేసి ఇప్పుడు షైన్ అవుతున్నాడు. వరుస సక్సెస్ లు కొడుతున్నాడు.. కాబట్టి తాను కూడా టైం తీస్కోని మంచి సినిమాతో వస్తాను”.. తప్పకుండా హిట్టు కొడతానని బిగ్ బాస్ సోహెల్ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు