Bigg Boss Maanas : గుడ్ న్యూస్… తండ్రి కాబోతున్న బిగ్ బాస్ మానస్

Bigg Boss Maanas : బిగ్ బాస్ సేమ్ మానస్ తాజాగా తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ ను పంచుకున్నారు. తాను తండ్రిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు తన భార్య బేబీ బంప్ ఫోటోలను కూడా షేర్ చేశారు.

తండ్రి కాబోతున్న మానస్

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక బిజీ నటుడిగా మారిపోయాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మానస్ తాజాగా తన భార్య శ్రీజ ప్రస్తుతం గర్భిణీ అనే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికీ తమ మనసులు పర్ఫెక్ట్ గా కలిసాయి అంటూ, ఇప్పుడు తమ కుటుంబంలోకి ఓ బుజ్జాయి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది అని అందులో పేర్కొన్నారు. బేబీ నాగులపల్లి వచ్చేస్తున్నాడు అంటూ తన భార్య శ్రీజ బేబి బంప్ తో ఉన్న పిక్ ను షేర్ చేశాడు. ఇక సమాచారం ప్రకారం శ్రీజ శ్రీమంతం వారం రోజుల క్రితమే ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ప్రస్తుతం తాను తండ్రి కాబోతున్నాను అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన మానస్ కు నెటిజన్లు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Maanas Nagulapalli: ఘనంగా బ్రహ్మముడి సీరియల్ హీరో నిశ్చితార్థం... అమ్మాయి  ఎవరంటే? | Brahma Mudi Serial Actor Maanas Nagulapalli Engaged Srija  Nissankara Photos Viral - Telugu Filmibeat

- Advertisement -

గుడ్ లక్ గా మారిన భార్య

ఇదిలా ఉండగా మానస్ 2023 నవంబర్లో చెన్నైకి చెందిన శ్రీజను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక నెల కూడా తిరగకముందే కొత్త కారు కొన్నాడు. ఇప్పుడేమో ఏడాది కూడా పూర్తి కాకముందే తను తండ్రి కాబోతున్నాను అనే మరో గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. దీంతో మొత్తానికి భార్య అడుగు పెట్టాక మానస్ కి బాగా కలిసి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నటుడిగా బిజీ బిజీ…

మానస్ ఓవైపు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూనే, సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో మానస్ కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సీజన్లో టాప్ 5 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచిన ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరిన్ని అవకాశాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. నిజానికి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు కూడా ఆయన సీరియల్స్ చేశారు. కానీ హౌజ్ లోకి వెళ్ళాక ప్రియాంకతో క్లోజ్ గా ఉంటూ అప్పట్లో వార్తల్లో నిలిచాడు. కానీ బయటకు వచ్చాక వీరిద్దరూ కలిసి కన్పించలేదు. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి అనే బుల్లితెర సీరియల్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. మరోవైపు కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు వంటి సినిమాల్లో హీరోగా కనిపించాడు. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సీరియల్స్ తోనే నెట్టుకొస్తున్నాడు. ముఖ్యంగా ఆయన చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ కు తెలుగు రాష్ట్రాలలో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు