BiggBoss8 Teaser : ఈసారి సరికొత్తగా.. ఒకసారి కమిటయ్యాక నో లిమిట్స్..

BiggBoss8 Teaser : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్8 వచ్చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ వస్తున్న మొదటి సీజన్ నుండి ప్రతి సారి సరికొత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఉండగా, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యాక టిఆర్పి రేటింగ్ లు కూడా సినిమాల రేంజ్ లో వస్తూ ఉంటాయి. ఇక మొదట హిందీలో ఈ సీజన్ స్టార్ట్ అవగా, తెలుగులో 2017 లో మొదలై సక్సెస్ ఫుల్ గా 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్‌, ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీస్‌ లతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇక ఇప్పుడు త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల కిందే అనౌన్స్ మెంట్ రాగా, తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ ని ఆఫీషియల్ గా స్టార్ మా మేకర్స్ రిలీజ్ చేసారు.

BiggBoss Telugu Season 8 Teaser Released

నో లిమిట్స్ అంటున్న కింగ్..

ఇక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్8 (BiggBoss8 Teaser) మొదలవుతున్నట్టు అధికారికంగా ప్రకటించిన స్టార్ మా, తాజాగా బిగ్ బాస్ 8 కి సంబంధించి కాసేపటికిందే టీజర్ ని రిలీజ్ చేసారు. కమెడియన్ సత్యని చూపిస్తూ, మొదలైన ఈ టీజర్ లో ఒక హౌస్ లో దొంగతనం చేస్తుంటే, జీని గా కింగ్ ప్రత్యక్షమయ్యి వ‌రాలు అందిస్తానంటాడు. ఇక కింగ్ మాట్లాడుతూ.. ఈ సారి మ‌రింత ఎంట‌ర్‌టైన్ ఇస్తానని.. “ఒక్కసారి కమిట్ అయితే.. లిమిటే లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ లో నో లిమిట్స్ అని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ కి నాగార్జున మూడో సీజన్ నుండి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, వరుసగా ఆరో సీజన్ కు కూడా హోస్ట్ గా చేస్తుండడం విశేషం.

- Advertisement -

బిగ్ బాస్ 8 లో భారీ స్టార్ కాస్ట్..

ఇక బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుండి స్టార్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై అఫిషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇక ఈ 8వ సీజన్ లో హౌస్ లోకి ఈసారి బాగా వైరల్ అయిన స్టార్ కాస్ట్ ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తుంది, బిగ్ బాస్ 8 హౌస్ లో విష్ణు ప్రియ‌, రితూ చౌద‌రి, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా, ఇప్పటికే కంటెస్టెంట్స్ గా ఫిక్స్ అయ్యారని సమాచారం. అలాగే వేణు స్వామి, క్రికెటర్ అర్జున్, 90స్ హీరో అబ్బాస్, వంటి నటులు ఎంట్రీ ఇస్తారని టాక్ నడుస్తుంది. మరి బిగ్ బాస్ నుండి మళ్ళీ ఎప్పుడు ఈ విషయం పై అనౌన్స్ మెంట్ వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు