Kalki 2898 AD : ఎంతకు తెగించ్చారురా, బిగ్గెస్ట్ బుక్ మై షో స్కాం

Kalki 2898 AD : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతగానం ఎదురుచూస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేరే స్థాయికి వెళ్ళిపోతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన రెండు ట్రైలర్లు కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రభాస్ అమితాబచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనే వంటి పెద్దపెద్ద స్టార్ కాస్ట్ కనిపించనున్నారు. ఈ సినిమా దాదాపు నాలుగు ఏళ్ల ముందు నుంచి తెరకెక్కుతుంది. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

Kalki 2898 AD (2024)

ఇకపోతే ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు నిరాశపరిచాయి. అయితే సలార్ సినిమా మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి కొంత ఉపశమనం కలిగించింది. ఇప్పుడు అందరు ఎదురుచూపులు కల్కి సినిమా పైన ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టిక్కెట్లను కొద్దిసేపటి క్రితమే బుక్ మై షో లో పెట్టారు.

- Advertisement -

కల్కి సినిమా టికెట్లు పెట్టగానే చాలామంది బుక్ మై షో యాప్ లో బుక్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే కొంతమందికి టికెట్ దొరకడం చాలా కష్టతరమైన పనిగా మారింది. కానీ కొందరికి మాత్రం టికెట్లు చాలా ఈజీగా బుక్ అయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాను మళ్ళీ రిలీస్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ కల్కి సినిమా అనుకొని చాలామంది రాజశేఖర్ నటిస్తున్న కల్కి సినిమా టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత పెద్ద స్కామ్ చేశారు అంటూ బుక్ మై షో ను ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజెన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు