Madhubala : మరో బయోపిక్ సిద్ధం

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా బయోపిక్ సినిమాలు వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో ఆ బయోపిక్ సినిమాలు చాలా ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు. ఇకపోతే బాలీవుడ్ లో ఇలాంటి బయోపిక్ సినిమాలు ఎప్పటినుంచో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ అయినా బయోపిక్ సినిమాలు ఉన్నాయి. అలాంటి బయోపిక్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు.

ఇక ఇప్పుడు ఉన్న యూత్ కి బాగా కనెక్ట్ అయిన బయోపిక్ అంటే ఎంఎస్ ధోని అని చాలామంది చెబుతారు. ఎంఎస్ ధోని స్టోరీని నీరజ్ పాండే డీల్ చేసిన విధానం చాలామందిని ఆకట్టుకుంది.
అందరికీ తెలిసిన కథని తెలియని కోణాల్ని అద్భుతంగా చూపించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ఫిలిమ్ ని అందుకున్నాడు నీరజ్ పాండే. ధోని కోసం ఈ సినిమాకి వెళ్లిన ఆడియన్స్ ని తన ఫ్యాన్స్ ను చేసేసుకున్నాడు ఈ సినిమాలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్.

ఇకపోతే ఇంతకుముందు బాగ్ మిల్కా బాగ్, గాంధీ వంటి ఎన్నో బయోపిక్ సినిమాలు వచ్చాయి. ఇకపోతే తెలుగులో బెస్ట్ బయోపిక్ మూవీ అంటే మహానటి అని చెప్పొచ్చు. మహానటి సావిత్రి గారి జీవితాన్ని, ఆమె జీవితంలో సాధించిన విజయాలని, ఆ జీవితంలో పడిన కష్టాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు చూపించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు నాగ్ అశ్విన్.

- Advertisement -

ఆ తర్వాత తెలుగులో కొన్ని సంఘటనలపై అలానే ఇంకొందరి ప్రముఖులు బయోపిక్ సినిమాలు కూడా తెరకెక్కించబడ్డాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను చవిచూశాయి. బాలకృష్ణ నటించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి అని చెప్పొచ్చు.

ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కనుంది. ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన మధుబాల బయోపిక్ ను తెరకెక్కించబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
మధుబాల విషయానికి వస్తే ఈమె 36 వయసులోనే కాలం చేశారు.
20 సంవత్సరాలకు పైగా సాగిన తన కెరీర్‌లో, మధుబాల ప్రధానంగా ఒక దశాబ్దం పాటు యాక్టివ్ గా ఉన్నారు. అయితే 1969లో ఆమె మరణించే సమయానికి 60కి పైగా చిత్రాలలో నటించారు.

నీల్ కమల్ (1947), అమర్ (1954), భయానక చిత్రం మహల్ (1949), శృంగార చిత్రాలైన బాదల్ (1951), తరానా (1951)తో విజయాన్ని సాధించింది. ఒక చిన్న ఎదురుదెబ్బ తరువాత, మధుబాల తన హాస్య పాత్రలతో మిస్టర్ & మిసెస్ ’55 (1955), చల్తీ కా నామ్ గాడి (1958, హాఫ్ టిక్కెట్ (1962), క్రైమ్ చిత్రాలైన హౌరా బ్రిడ్జ్, కాలా పానీ ( 1958), సంగీత బర్సాత్ కి రాత్ (1960) లలో నటించారు.

అయితే ఈమె జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు ప్రపంచానికి తెలియని కొన్ని రహస్య కోణాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఈ మధుబాల బయోపిక్ లో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ జస్మీత్ కె. రీన్ తెరకెక్కించినున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు