Aarthi Agarwal: ఆత్మహత్యకు ప్రయత్నించిందా ?

తెలుగు తెరమీద తారాజువ్వలా దూసుకొచ్చిన యువతరాల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది ఆర్తి అగర్వాల్. తన అందంతో సినీ ప్రముఖులనే కాకుండా ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. కుర్ర హీరోల నుండి అగ్ర హీరోల వరకు అందరి సరసన నటించింది. అయితే ఆమె కెరీర్ రివ్వున దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా గ్రాఫ్ కింద పడింది. అప్పటినుంచి మళ్లీ కోలుకోలేకపోయింది.

వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆర్తి.. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు. ఈమె నటిగా కంటే వ్యక్తిగత విషయంలో మాత్రం బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. వ్యక్తిగత విషయంలో కేవలం ఒక్క విషయంలోనే కాకుండా తన పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో, తనకున్న అలవాట్ల విషయంలో బాగా వైరల్ గా మారింది.

అప్పట్లో తనతో కలిసి నటించిన లవర్ బాయ్ తరుణ్ తో ప్రేమలో పడ్డట్లు తెలిసింది. ఆ తరువాత వీరిద్దరూ విడిపోయారని, ఆ సమయంలో ఆ ప్రేమ విషయాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించండి అని వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత 2007లో న్యూ జెర్సీకి చెందిన ఉజ్వల్ వికమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాకు వెళ్లి సెటిల్ అయింది.

- Advertisement -

కానీ తన భర్తతో కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోయి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్ళీ అడుగు పెట్టింది. కానీ ఆ సమయంలో ఆర్తికి అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతో చిన్న చిన్న సినిమాలలో కూడా తప్పనిసరిగా నటించింది.

అయితే మళ్లీ కెరీర్ లో నిలదొక్కుకోవాలనే క్రమంలో ఆమెను మృత్యువు కబలించింది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చేసుకున్న లైపోసెక్షన్ సర్జరీ ఆరు వారాల తర్వాత వికటించింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో 2017 జూన్ 6వ తేదీన ఆమె మరణించారు. ఆమె మరణానికి కారణం గుండెపోటు అని మేనేజర్ వెల్లడించారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు