NKR21 : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా నుండి సాలిడ్ పోస్టర్ వదిలిన మేకర్స్..

NKR21 : టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో డెవిల్ తో ప్లాప్ అందుకున్నా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తాను నిర్మిస్తున్న దేవర చిత్ర నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూనే తన సినిమాల షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన21వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, అశోక క్రియేషన్స్ బ్యానర్ లో సంయుక్తంగా అశోక్ వర్ధన్ ముప్ప తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

Birthday wishes to Kalyan Ram with a special poster from NKR21 movie makers

క్రేజీ పోస్టర్ తో కళ్యాణ్ రామ్ కి బర్త్ డే విషెస్..

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్బంగా తాజాగా ఒక సాలిడ్ పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ గా డైనమిక్ అండ్ డాషింగ్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో ఒక ఆఫీస్ లో కూర్చుని ఫైట్ చేస్తున్నట్టు కుర్చీలో కూర్చుని ఉన్న స్టిల్ లో చేతికి అంటుకున్న నిప్పును చూపిస్తూ ఉన్నాడు. చుట్టూ కూడా ఫైర్ అవుతున్న దృశ్యం పోస్టర్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ కి మేకర్స్ మంచి బర్త్ డే ట్రీట్ ని ఇచ్చారని చెప్పాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకుంటూనే ఉండగా, ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ ఉన్న నేపథ్యంలో దీపావళి వరకు ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశం లేదు.

- Advertisement -

అంచనాలు పెంచేస్తున్న NKR21..

ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఇంకా టైటిల్ నిర్ణయించని NKR21 నుండి ఆల్రెడీ సీనియర్ నటి విజయశాంతి కి సంబంధించి ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ మంచి క్రేజీ అంచనాలను పెంచింది. చాలా ఏళ్ళ తర్వాత ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది ఈ సినిమాలో. ఇప్పుడు కళ్యాణ్ రామ్ బర్త్ డే పోస్టర్ కూడా అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇయర్ ఎండ్ లో మూవీ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు