HBD NidhiAgarwal : ‘వీరమల్లు’ నుండి నిధి అగర్వాల్ స్టన్నింగ్ పోస్టర్ విడుదల!

HBD NidhiAgarwal : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “హరిహరవీరమల్లు” ఒకటి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా దాదాపు నాలుగేళ్లుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూసి చూసి అలసిపోయినట్టు అనిపిస్తుంది. డైరెక్టర్ క్రిష్ అయితే ఏకంగా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. అప్పుడు సినిమా ఆగిపోయిందని అభిమానులు కంగారు పడ్డా, నిర్మాత ఏఎం రత్నం వెంటనే దర్శకుడు జ్యోతి కృష్ణని రంగంలోకి దించి మిగతా పార్ట్ ని షూట్ చేయిస్తున్నాడు. ఈ డైరెక్టర్ స్వయానా ఏఎం రత్నం కొడుకే కాబట్టి సినిమా విషయంలో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ సినిమా షూటింగ్ తుది దశలో ఉన్నా, పవన్ కళ్యాణ్ (Pawan kalyan) రాజకీయాల బిజీ వల్ల ఇంకా సెట్స్ పైకి రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ముందు ఈ సినిమానే ఫినిష్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Birthday Wishes to NidhiAgarwal from HariharaVeeramallu Team

మొదలైన షూటింగ్ త్వరలో పూర్తి…

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ శుక్రవారమే హరిహర వీరమల్లు (HariharaVeeramallu) షూటింగ్ మళ్ళీ ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కూడా మొదలు కాగా, పవన్ కళ్యాణ్ త్వరలోనే సెట్స్ త్వరలోనే జాయిన్ కానున్నారు. ఇక పవన్ నుంచి అనౌన్స్ అయిన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహరవీరమల్లు కాగా, ఈ సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -

స్టన్నింగ్ పోస్టర్ తో నిధి అగర్వాల్ కి బర్త్ డే ట్రీట్..

ఇక తాజాగా ఈరోజు “నిధి అగర్వాల్ (HBD NidhiAgarwal) బర్త్ డే సందర్బంగా స్పెషల్ ట్రీట్ ఇస్తూ, బర్త్ డే కానుకగా మేకర్స్ హరిహర వీరమల్లు నుండి ఒక అద్భుతమైన పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ లో అదరగొడుతూ, అట్రాక్ట్ చేస్తుంది. ఒక యువరాణి లా తన డ్రెస్సింగ్ స్టైల్, ఆభరణాలు కాస్ట్యూమ్స్ కాస్ట్యూమ్స్ తో నిధి చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమా నిధి అగర్వాల్ కి కెరీర్ టర్న్ అయ్యే సినిమా కాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, పాన్ ఇండియా భాషల్లో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు