Avinash: గత కొద్ది రోజుల క్రితం బుల్లితెర నటుడు జబర్దస్త్ అవినాష్ త్వరలోనే తండ్రి కాబోతున్నాను అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని తన భార్య అనూజ తో కలసి ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక విషాదాన్ని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు అవినాష్.. తన భార్య అనూజకు అబార్షన్ అయిందని.. తాము తమ బిడ్డను కోల్పోయామని తెలియజేశారు.
ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఈ విషయం మీద ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసి తమను ఇంకా బాధ పెట్టకండి అంటూ తెలియజేశారు. తన లైఫ్ లో సంతోషకరమైనా.. బాధ అయినా ఒక కుటుంబంలా భావించి మీతోనే పంచుకుంటాను.. ఇప్పటివరకు తన ప్రతి ఆనందాన్ని కూడా పంచుకున్నాను.. కానీ మొదటిసారి జీవితంలో ఇలాంటి విషాదాన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను అంటూ రాసుకొచ్చారు. మేము తల్లిదండ్రులు కావాలని ఈరోజు కోసం చాలా ఎదురు చూశాము..కానీ కొన్ని కారణాల చేత మేము మా బిడ్డను కోల్పోయాం అంటూ తెలిపారు.
ఈ విషయాన్ని అంత తొందరగా మరిచిపోలేము.. మీకు ఎప్పటికైనా ఈ విషయం తెలియాల్సిందే.. అదే మా బాధ్యత అని తెలిపారు. సెలబ్రిటీలు, సన్నిహితులు, అభిమానులు సైతం ధైర్యాన్ని తెలియజేస్తున్నారు.. జబర్దస్త్ కామెడీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ముక్కు అవినాష్ బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ అందుకున్నారు.
అలా వచ్చిన పాపులారిటీ తర్వాత 2021లో అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.. ప్రస్తుతం బుల్లితెర పైన పలు రకాల ఈవెంట్స్ తో బిజీగా ఉన్న ముక్కు అవినాష్ అడపా దడపా సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నారు. తాజాగా అవినాష్ తన జీవితంలో జరిగిన ఇలాంటి చేదు సంఘటనను షేర్ చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ పోస్ట్ వైరల్ గా మారుతున్నది.
For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News