Bobby: ఆవగింజను మించిన అదృష్టం ఉంది

చాలా సినిమాలకు రచయితగా పనిచేసే తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు బాబీ. రవితేజ హీరోగా చేసిన పవర్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బాబి. ఆ సినిమాతోనే మంచి సక్సెస్  సాధించి తనలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో అవకాశాన్ని అందుకున్నాడు బాబీ.

పవర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వం చేసిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుల సైతం పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయాలని చాలా ట్రై చేశారు. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కలేదు. కానీ అదృష్టం బాబీ రెండవ సినిమాకి దక్కింది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ అనే సినిమాను తెరకెక్కించాడు బాబీ. అయితే ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో చూపించి పరిపూర్ణమైన నటుడిని బయటికి తీశాడు బాబి. ఆ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య తో మల్టీస్టారర్ సినిమా వెంకీమామను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.

- Advertisement -

ఇక బాబీకి తనకంటూ ఒక బ్లాక్ బస్టర్ సినిమా పడి, అద్భుతమైన హిట్ తన కెరీర్ లో వచ్చింది అని అంటే అది వాల్తేరు వీరయ్య అని చెప్పొచ్చు. ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత మెగాస్టార్ లో ఒక కంప్లీట్ కమర్షియల్ హీరో బయటకు వస్తే చూడాలని చాలామంది అభిమానులు ఆశపడ్డారు. అందరి ఆశలను వాల్తేరు వీరయ్య సినిమాతో తీర్చేశాడు బాబీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాకి రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా కూడా కలెక్షన్స్ వండర్ఫుల్ గా వచ్చాయి.

ఇక ప్రస్తుతం బాబి ఎన్.బి.కె 109 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇంక రిలీజ్ చేసిన ఆ వీడియో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ లోని ఆడియన్స్ ఇష్టపడే అంశాలన్నిటిని ఆ వీడియో కట్ లో పొందుపరిచాడు బాబీ.

ఇకపోతే బాబి అతి తక్కువ టైంలోనే చాలామంది స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. ఈ అదృష్టం అందరికీ దక్కదు. బాబీలో కష్టపడే తత్వంతో పాటు కొద్దిపాటి అదృష్టం కూడా ఉందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో కూడా వర్క్ చేసిన అదృష్టం బాబీకి దక్కడం విశేషం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు