Kalki2898AD : కల్కిపై బాలీవుడ్ నటుడు తీవ్ర ఆగ్రహం.. మేకర్స్ చాలా పెద్ద తప్పు చేశారట?

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 27న విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తు దూసుకుపోతుంది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన పాన్ ఇండియా నటులు నటించడం వల్ల, భారీ ఓపెనింగ్స్ దక్కింది. పైగా విడుదలైన అన్ని భాషల్లో కూడా యానానిమస్ గా మంచి టాక్ తెచ్చుకోవడం విశేషం. ప్రభాస్ తో సహా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మైథలాజి టచ్ ఇవ్వడం పట్ల కామన్ ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి వచ్చింది. థియేటర్లలో ఇప్పటికే 700 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినీమాలో పురాణాలకి సంబంధించి మహాభారత యుద్ధానికి సంబంధించిన కృష్ణార్జునులు, అలాగే అశ్వద్ధామ, కర్ణ పాత్రలని కూడా చూపించడం జరిగింది. అయితే కల్కి వచ్చినప్పటి నుండి ఈ సినిమాలో పురాణాల పాత్రలు చూపించడం పట్ల పలువురు ఆడియన్స్ తో పాటు సెలెబ్రిటీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ నటుడు కూడా కల్కిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.

Bollywood actor Mukesh Khanna's sensational comments on Kalki2898AD

కల్కిపై ఆగ్రహంలో ముఖేష్ ఖన్నా!

బాలీవుడ్ నటుడు ముఖేష్ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా శక్తిమాన్ సీరియల్ తో పాన్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యాడు. అయితే లేటెస్ట్ గా ముఖేష్ ఖన్నా కల్కి సినిమా చూడగా, ఆ సినిమా మేకర్స్ పై అయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ లో కల్కి గురించి ప్రస్తావిస్తూ కల్కి లో చూపించిన మహాభారతంలోని సన్నివేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కల్కి గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పుకొచ్చారు… ‘కల్కి చిత్రం విజువల్ గా చాలాబాగుంది. నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా అద్భుతంగా ఉంది. కానీ మహాభారతంలో యుద్ధ సన్నివేశాలని పూర్తిగా వక్రీకరించారు. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని అసహనం వ్యక్తం చేసారు. అలాగే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు అశ్వథామని వేడుకున్నట్లు చూపించారని, అలాగే శ్రీకృష్ణుడు అశ్వథామ యొక్క మణిని తొలగించడం.. భవిష్యత్తులో నువ్వే నాకు రక్షణ కల్పించాలి వేడుకోవడం మహాభారతంలో ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు.

- Advertisement -

క్షమించరాని పెద్ద తప్పు చేసారు – ముఖేష్ ఖన్నా

ఇక కల్కి (Kalki2898AD) చిత్రంపై విమర్శలు గుప్పిస్తూ, మీకు (మేకర్స్) వ్యాసునికంటే ఎక్కువగా భారతం గురించి తెలుసా అని ముఖేష్ ఖన్నా కల్కి చిత్ర యూనిట్ ని ప్రశ్నించడం జరిగింది. అలాగే పురాణాల ప్రకారం శ్రీమహా విష్ణువు అవతారమైన శక్తివంతుడైన శ్రీకృష్ణుడు కల్కి సినిమాలో అశ్వథామని భవిష్యత్తులో తనని రక్షించమని అడగడం ఏంటి. ఇదంతా వక్రీకరించడమేనని, చిత్ర యూనిట్ సరిదిద్దుకోలేని తప్పు చేసారని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా చిత్ర యూనిట్ మేలుకొని రాబౌయే భాగంలో స్క్రిప్ట్ ని సరిదిద్దాలని, ఈ స్కిప్ట్ ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీతో బోర్డుని నియమించాలని ముఖేష్ ఖన్నా కోరారు. ఇక కల్కి2898AD పై ఇలాంటి విమర్శలు రిలీజ్ ముందు రోజు నుండి వస్తుండగా, విమర్శలతో సంబంధం లేకుండా కల్కి భారీ వసూళ్లు సాధిస్తుంది. అయితే ఇలాంటి విమర్శలకు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తే మంచిదని ట్రేడ్ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు