Bollywood acter: ఆడవాళ్లే కాదు.. మగవాళ్లు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే..!

Bollywood actor.సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది సెలబ్రిటీలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి.. మరి కొంతమంది ఇలాంటివి చెప్పడానికి మొహమాట పడినా.. కొంతమంది ధైర్యంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలను ప్రత్యేకించి అటు బాలీవుడ్ హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన మెల్ యాక్టర్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని తెలియజేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అందుకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం.

Bollywood actor: Not women.. Men are also victims of casting couch..!
Bollywood actor: Not women.. Men are also victims of casting couch..!

కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ సిద్ధాంత కర్ణిక్..

బాలీవుడ్ లో సినిమాలో నటించిన సిద్ధాంత కర్నిక్ ఇటీవలే పలు విషయాలను తెలియజేశారు.. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ తెలియజేశారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్, యానిమల్ చిత్రాలలో కీ రోల్ లో నటించారు నటుడు సిద్ధాంత కర్నిక్. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరియర్ ఆరంభంలో తనకు క్యాస్టింగ్ కౌచ్ చేదు సంఘటన ఎదురయింది అంటూ తెలియజేశారు. తన కెరియర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో కూడా నటించానని…ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

అర్ధరాత్రి రమ్మన్నారు..

తనకి ఎవరూ సపోర్టుగా లేరని.. అది 2005 సంవత్సరం అప్పుడు తన వయసు 22 సంవత్సరాలు.. ఒక సినిమా అవకాశం కోసం కోఆర్డినేటర్ ని కలిసినప్పుడు.. అతడు తన దగ్గర ఉన్న అన్ని విషయాలను తీసుకుని..రాత్రి 10:30 నిమిషాలకు సైతం తనని ఇంటికి రమ్మని చెప్పారట.. ఆ సమయంలో తనని పిలవడం చాలా వింతగా కూడా అనిపించింది అంటూ సిద్ధాంత్ కర్నిక్ తెలియజేశారు. ఆయన అవకాశాల కోసం అక్కడికి వెళ్ళక తప్పలేదని.. కానీ ఆ ఇల్లు, అందులో ఉండే ఫోటోలు, చుట్టూ వాతావరణం చూసిన తర్వాత నాకు అది సేఫ్ ప్లేస్ కాదనిపించిందని.. అలాగే కోఆర్డినేటర్ మాటలు విన్న తర్వాత తనకు చాలా అనుమానం వచ్చి అక్కడ నుంచి బయటికి వచ్చేసానని తెలిపారు.

- Advertisement -

కెరియర్ లేకుండా నాశనం చేస్తామన్నారు..

సినిమా విషయంలో రాజీ పడకపోతే ఖచ్చితంగా నీకు కెరియర్ లేకుండా చేస్తానంటూ బెదిరించారు. ఈ బెదిరింపులకు నేను భయపడకుండా అక్కడి నుంచి బయటికి వచ్చేసాను అంటూ వెల్లడించారు..ప్రస్తుతం బాలీవుడ్ నటుడు చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుతం సిద్ధాంత కర్ణిక్ వయసు 41 సంవత్సరాలు.. ఇప్పటికి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ బాగానే పేరు సంపాదించారు.. సిద్ధాంతి కర్ణిక్ యానిమల్ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించడం జరిగింది. ఏదేమైనా ఇప్పటివరకు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే ఇలా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని చెప్పుకొచ్చారు.. కానీ ఇప్పుడు మగవారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడ్డామని చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసరికి ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఎవరికైనా తిప్పలు తప్పవని స్పష్టం అవుతోంది. మరి ఇంకెవరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Sidhaant Karnick (@siddhantkarnick)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు