Bollywood Actress: భారీ బ్యాక్ గ్రౌండ్ కానీ రూ.50 జీతం.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే..?

Bollywood Actress.. సినీ ఇండస్ట్రీలోకి చాలామంది సినిమా బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగుపెట్టి ఆ ఇమేజ్ ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది భారీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా తమకు ఏమీ లేదు అన్నట్టుగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. కష్టపడి ఆ తర్వాత ఉన్నత స్థాయికి చేరుకుంటూ ఉంటారు.. అలాంటి వారిలో ప్రముఖ సీనియర్ నటి రూపాలీ గంగూలీ కూడా ఒకరు. ముఖ్యంగా సినీ రంగమైనా..టీవీ రంగమైనా ఎందులో అయినా సరే చాలామంది కళాకారులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కొంతమంది తమ గుర్తింపు నిలబెట్టుకోవడంలో సక్సెస్ కూడా అయ్యారు.. ఈ క్రమంలోనే రూపాలి గంగూలీ కూడా తన తండ్రి పెద్ద ఫిలిం మేకర్ అయినా సరే ఆమె దానిని సద్వినియోగం చేసుకోకుండా సొంత కాళ్లపై నిలబడి నేడు బాలీవుడ్ లోనే అత్యంత స్టార్ సెలబ్రిటీగా పేరు దక్కించుకుంది..

43ఏళ్ల వయసులో అదృష్టం..

Bollywood Actress: Huge background but Rs.50 salary.. Now in the industry..?
Bollywood Actress: Huge background but Rs.50 salary.. Now in the industry..?

ఈమె తండ్రి దర్శకుడిగా ఉన్నప్పటికీ ఈమె నటిగా మైళ్ళ దూరం నడిచేది. తన కెరీర్ ను నాటక రంగం నుంచి ప్రారంభించిన ఈమె ఒక్కో నాటకానికి 50 రూపాయలు చొప్పున పారితోషకం తీసుకునేది. ఇక క్రమంగా టీవీ, సినిమాలలో తనదైన ముద్ర వేస్తూ పేరు సంపాదించుకునే ప్రయత్నం చేసింది.. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. కానీ 43 సంవత్సరాల వయసులో ఆమె అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన నటి గా పేరు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 47 ఏళ్లు.. ఈమె నటిస్తున్న ఒక టీవీ షో ఇప్పుడు టిఆర్పి రేటింగ్ లో అగ్రస్థానంలో నిలవడంతో ఈమె పేరు ఒక్కసారిగా మారూమ్రోగిపోతోంది..

దుష్మన్ దేవతా తో సర్వం కోల్పోయాము..

అంతేకాదు ప్రస్తుతం ఈమె స్టార్ డంను చూసి సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఆశ్చర్యపోతోందని చెప్పవచ్చు. భారీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా దానిని ఉపయోగించుకోకుండా సొంత కాళ్లపై నిలబడి నేడు అందరిని తన వైపు తిప్పుకున్న రూపాలీ గంగూలీ ఎంతో మందికి ఆదర్శమని చెప్పవచ్చు.. ఇకపోతే ఈమె తండ్రి అనిల్ గంగూలీ.. ఈయన సినిమా నిర్మాత ఎన్నో సినిమాలు చేసినా.. 1991లో విడుదలైన దుష్మన్ దేవతా సినిమాతో ఒక్కసారిగా ఆస్తులు అన్నీ కోల్పోయారు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. ఒక ఇంటర్వ్యూలో రూపాలీ తన కష్టతరమైన ప్రయాణం, ఆర్థిక సంక్షోభం గురించి కూడా తెలిపింది.

- Advertisement -

15 కి.మీ. నడిచి వెళ్ళేవాళ్ళం..

ఇకపోతే రూపాలీ గంగూలీ మాట్లాడుతూ.. మా నాన్న సినిమాలు ఫ్లాప్ అవడం , మేము పేదవాళ్లు కావడం వల్ల నేను వర్లీ నుండి పృథ్వి థియేటర్ కి సుమారు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లేదానిని.. మా దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేశాము.. ఇక ఒత్తిడి వల్ల మా నాన్నకు మధుమేహం రావడంతో పాటు కొన్ని కారణాల వల్ల మొత్తం డబ్బును మేము కోల్పోయాము.. ఆ రోజుల్లో కార్పొరేట్ వ్యవస్థ లేనందు వల్ల నిర్మాతలు తమ ప్రైవేట్ ఆస్తిని కూడా పణంగా పెట్టి సినిమాలు తీశారు.. అలా నగలు అమ్మి, ఇంటిని తాకట్టు పెట్టి.. ఆ డబ్బుతో సినిమాలు తీస్తే అవి ఫ్లాప్ అయితే ఇక ఎటు కాకుండా వారి పరిస్థితి మారిపోతుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

రూ.50 నుండీ రూ.3 లక్షల వరకూ..

పృథ్వీ థియేటర్లో ఆత్మకథ అనే మొదటి నాటకం చేసిన ఈమె దానిని దినేష్ ఠాకూర్ నిర్మించారని తెలిపింది. ఇందులో నటించిన అందుకు 50 రూపాయలు ఇచ్చినట్లు సమాచారం.. ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో ఎపిసోడ్ కు 3 లక్షల రూపాయలు వసూల్ చేస్తూ రికార్డు సృష్టించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు