Janhvi Kapoor: NTR30 వల్ల ఒరిగింది ఏం లేదు… మళ్లీ అదే తీరు ?

అలనాటి అందాల తార శ్రీదేవి. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్. ఈ స్టార్స్ కి ఉన్న గారాల పట్టి… జాన్వీ కపూర్. ఇంతటి బ్యాగ్రౌండ్ ఉన్న జాన్వీ మూవీ కెరీర్ ఓ రేంజ్ లో ఉండాలి. కానీ, బీ టౌన్ లో టైర్-2 రేంజ్ హీరోయిన్స్ కంటే దారుణంగా జాన్వీ కెరీర్ ఉందని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలేవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనే పేరును నోచుకోలేదు. ఈమె డెబ్యూ మూవీ ధడక్ మంచి హిట్ అయింది. కానీ, అలాంటి హిట్ ను జాన్వీ మళ్లీ చూడలేదు. అలాగే ఈ స్టార్ కిడ్ చేసే సినిమాలన్నీ కూడా చిన్నా చితక సినిమాలే. బాలీవుడ్ లో స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు. కానీ, ఏ ఒక్కరి సినిమాల్లో కూడా జాన్వీ కపూర్ కి ఛాన్స్ దక్కడం లేదు.

అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఎక్కువ ఫేమస్ అవ్వడంతో, ఇతర ఇండస్ట్రీలో సక్సెస్ రేటు తక్కువ ఉన్నవాళ్లు, తెలుగులో సినిమాలు చేసి, క్రేజ్ పెంచుకుని, తిరిగి తమ సొంత ఇండస్ట్రీకి వెళ్లి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. అదే దారిని ఈ బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్ కూడా ఎంచుకుంది. తనకు హీరోల్లో ఎన్టీఆర్, డైరెక్టర్స్ లో కొరటాల శివ అంటే ఇష్టమని చెప్పిన ఈ బాలీవుడ్ బ్యూటీకి కొద్ది రోజుల్లోనే, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న NTR30లో హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

ఈ ఛాన్స్ ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం పక్కన పెడితే, NTR30లో అవకాశం వచ్చిన తర్వాత, జాన్వీ కెరీర్ బాలీవుడ్ లో మారిపోతుందని అనుకున్నారు. కానీ, NTR30 ఛాన్స్ వల్ల బీ టౌన్ లో ఈ స్టార్ కిడ్ కెరీర్ ఏ మాత్రం మారిపోలేదు. ఎప్పటిలాగే, ఊరు పేరు లేని డైరెక్టర్, పెద్దగా క్రేజ్ లేని హీరోలతోనే సినిమాలు చేస్తోంది. తాజాగా జాన్వీ నుంచి ఉలాజ్ అనే పేరుతో ఓ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది. దీని డైరెక్టర్ సుధాంషు సరియా. ఇతనికి ఇంగ్లీష్ లో షార్ట్ ఫిల్మ్స్, హిందీలో ఒక చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉంది.

- Advertisement -

అంటే NTR30 వల్ల జాన్వీకి ఇప్పటి వరకు ఎలాంటి లాభం జరగలేదని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఛాన్స్ వచ్చినా, బాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు జాన్వీ ని పట్టించుకోవడం లేదని తెలిసిపోతుంది. NTR30 విడుదలైన తర్వాత అయినా, బాలీవుడ్ లో ఈమెకు పెద్ద సినిమాల్లో ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు