Katrina Kaif : డిప్రెషన్ లో బాలీవుడ్ బ్యూటీ ?

దాదాపు ఒక దశాబ్ధం పాటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగతుంది కత్రినా కైఫ్. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం కత్రినా నటించిన ఫోన్ బూత్ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ బూత్ సినిమా నవంబర్ 4న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందకు రానుంది. దీంతో పాటు కత్రినా కైఫ్ చేతిలో మేరీ క్రిస్మస్, టైగర్ 3 లాంటి సినిమాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. కత్రిన కొన్ని రోజుల క్రితం తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందట. ఈ ప్లాస్టిక్ సర్జరీ వికటించిందని సమాచారం. దీంతో కత్రినా కైఫ్ డిప్రెషన్ లోకి వెళ్లిందని నెటింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ప్లాస్టిక్ సర్జరీలు సర్వ సాధారణం. ప్రతి హీరోయిన్ కొన్ని సినిమాలు ఒక సారి తన మొహంలో ప్లాస్టిక్ సర్జరీల ద్వారా చాలా మార్పులు చేసుకుంటారు. ఇందులో చాలా వరకు సక్సెస్ అవుతాయి. అదే విధంగా అతి తక్కువ సంఖ్యలో ఫెయిల్ అవుతాయి.

అలా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చేసుకున్న ప్లాస్టిక్ సర్జరీ కూడా ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి కత్రిన ప్లాస్టిక్ సర్జరీ నిజమోనా ? అది వికటించడం వాస్తవమేనా ? ఈమె డిప్రెషన్ లోకి వెళ్లింది ఎంత వరకు కరెక్ట్ ? అనే వాటికి సమాధానం రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు