Bollywood : బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లలో వీడియోలు షూట్ చేసిన పాపులర్ వెడ్డింగ్ ఫిల్మర్ విశాల్ పంజాబీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ ఉదంతాన్ని వెల్లడించారు. పెళ్లయిన రెండు నెలల్లోనే ఓ బాలీవుడ్ నటుడు తన భార్యను మోసం చేసిన సంఘటనను బయట పెట్టి బాంబ్ పేల్చాడు.
స్టార్ హీరో బండారం బట్టబయలు
బాలీవుడ్లో సెలబ్రిటీ జంటల గురించి ప్రతిరోజూ అనేక గాసిప్స్ వింటూనే ఉంటారు. కొన్ని సెలబ్రిటీల కథలు సినిమా కథను తలపించే విధంగా ఉంటాయి. హై ప్రొఫైల్ సెలబ్రిటీల పెళ్లిళ్లలో వీడియోలు షూట్ చేసే ఫిల్మ్ మేకర్ విశాల్ పంజాబీ అలాంటి ఓ కథనే తాజాగా చెప్పాడు. అతనికి సెలబ్రిటీల గురించి చాలా కథలు తెలుసు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన స్టోరీని విని అందరూ షాక్ అవుతున్నారు. విశాల్ పంజాబీ ఓ స్టార్ కపుల్ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ ఘటన వల్ల ఇప్పటికీ తనకు రావలసిన డబ్బులు రాలేదన్నారు. బాలీవుడ్లో ఓ పెద్ద నటుడు పెళ్లయిన రెండు నెలల్లోనే భార్యను మోసం చేశాడని, అంతేకాకుండా ఆ నటుడు రెడ్ హ్యాండెడ్‌గా తన భార్య దగ్గర పట్టుబడ్డాడని చెప్పుకొచ్చారు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. పెళ్లయిన రెండు నెలల్లోనే ఓ సెలబ్రిటీ తన భార్యను మోసం చేశాడు. సెట్లో మేకప్ వ్యాన్‌లో నటితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతని భార్య లోపలికి వెళ్లి అతనిని నగ్నంగా పట్టుకుంది. నేను అతనికి వెడ్డింగ్ వీడియో గురించి కాల్ చేసినా ఫోన్ ఎత్తలేదు. ఆయన భార్యకు ఫోన్ చేస్తే ఆమె నాకు పెళ్లి వీడియోలు అక్కర్లేదు అని అరిచింది. తర్వాత వాళ్ల మేనేజర్‌కి ఫోన్ చేశాను. అతను కూడా అదే అని చెప్పి షాక్ ఇచ్చారు. ఆ వీడియోతో నేనేం చేసుకోవాలి అని ఆలోచనలో పడిపోయాను?” అంటూ అప్పట్లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నారు.
హీరో మొసలి కన్నీళ్ళు
వెడ్డింగ్ షూట్ మొత్తం పూర్తయినా డబ్బులు రాకపోవడంతో ఎట్టకేలకు విశాల్ తన వ్యాపారంలో కొన్ని రూల్స్ మార్చేశాడు. “అప్పట్లో నేను పెళ్లికి ముందు 50 శాతం, పెళ్లి తర్వాత 50 శాతం మనీ తీసుకునేవాడ్ని. కానీ ఈ సంఘటన తర్వాత నేను ముందే 100 శాతం డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాను” అని విశాల్ వివరించాడు. ఆ పెళ్లికి సంబంధించిన ఫుటేజీలు ఇప్పటికీ నా వద్ద ఉన్నాయని, తాను దాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదించగలను అంటూ జోక్ చేశాడు.
“నా దగ్గర ఇంకా ఆ పెళ్లి రికార్డు ఉంది. భర్త ఏడుస్తూ ‘ఐ లవ్ యూ బేబీ’ అంటున్నాడు. అవి మొసలి కన్నీళ్లని చూడగానే అర్థం అవుతుంది. అతను ఓ పెద్ద బాలీవుడ్ నటుడు. నేను పేరు చెప్పలేను. కానీ నేను అతనిని నిజంగా మిస్ అవుతున్నాను. నా దగ్గర ఉన్న ఆ ఫుటేజీ విలువ లక్షల్లో ఉంటుంది. ఇది కామెడీ చిత్రం. దీన్ని అమ్మడం ద్వారా నేను చాలా డబ్బు సంపాదించగలను” అని విశాల్ తెలిపారు. విశాల్ ఇప్పటివరకు అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా వంటి ప్రముఖుల వివాహ వీడియోలను చిత్రీకరించాడు. మరి ఆయన చెప్పింది ఏ స్టార్ గురించి అన్నది మాత్రం క్లారిటీ లేదు.